‘మాధవీలత అను నేను’ కాషాయి కండువా సాక్షిగా.. జనసేనను!!

0‘జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై నాకున్న ప్రేమ ఫలితం ఆశించనిది. పవన్‌ సినిమాలు చూసి ఇష్టపడలేదు. ఆయన వ్యక్తిత్వం తెలిసి ఇష్టపడుతున్నా.. నా అభిప్రాయంలో నా లైఫ్‌లో పవన్ తప్ప ఇంకొకరు రారు లేరు అని కాదు. అది హృదయానికి సంబంధించిన ప్రేమ. అర్థం అయితే చాలు లేదంటే మీ ఏడుపు మీరు ఏడ్వండి. ఈ సందర్భంగా మీకో ఖచ్చితమైన స్టేట్ మెంట్ ఇస్తున్నా.. నాకు షాపింగ్ అంటే ఇష్టం.. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం.. అలాగే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఈ మూడు నా లైఫ్‌లో మారవు. కాశీలో వదిలేయమన్నా.. వదిలేయను’ అంటూ ఫేస్ బుక్‌ ద్వారా రకరకాల కామెంట్స్ చేస్తూ పవన్ ఫ్యాన్స్‌కి దగ్గరయ్యే ముమ్మర ప్రయత్నాలు చేసింది మాధవీ లత.

చిన్నప్పటి నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ. ఆయన వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఆయన స్థాపించిన జనసేన పార్టీకి నా ఫుల్ సపోర్ట్.. అందుకు దేనికైనా సిద్ధం అని స్టేట్ మెంట్ ఇచ్చేసిన నచ్చావులే బ్యూటీ గుట్టు చప్పుడు కాకుండా కాషాయ కండువా కప్పేసుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆ పార్టీలో చేరింది. ఇది పవన్ అభిమానుల్ని కాస్త ఆశ్చర్యం కలిగించిన విషయమే.
ఎందుకంటే జనసేన గురించి, పవన్ గురించి.. ఆయన పర్మిషన్ లేకుండానే పవన్ అభిమానుల్ని వెంటబెట్టుకుని మరీ పవన్‌పై విమర్శలు గుప్పించిన శ్రీరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా అప్పట్లో ఫిల్మ్ ఛాంబర్ వద్ద నిరసనకు దిగింది. అంతటితో ఆగిందా? కాస్తో కూస్తో పాపులారిటీ రావడంతో తనకు తానే ‘నేను పవన్‌కి నాలుగో భార్యను’ కాదండీ బాబూ అని ఎవరూ అడక్కుండానే తెగ చెప్పుకొచ్చింది. ఇన్ని చేసి ఎలాగోలా పవన్ దృష్టిలో పడదాం అనుకున్న ఈమె ఆశలు ఫలించనేలేదు. పవన్ కళ్యాణ్ నుండి కనీసం చిన్న ఫోన్.. ఎట్ లీస్ట్ చిన్న మెసేజ్ కూడా లేకపోవడంతో లాభం లేదనుకుని వేసవిలో ఉక్కబోతను సైతం లెక్కచేయకుండా కాషాయం కండువా కప్పేసుకుంది.
ఇక పార్టీలో జాయిన్ అయిన తరువాత అప్పటి వరకూ జనసేనను, పవన్ కళ్యాణ్‌ను గురించి చెప్పికొచ్చిన మాటలను పక్కన పెట్టేసి.. ఫేస్ బుక్ వేదికగా పొలిటికల్ స్పీచ్‌లు మొదలు పెట్టింది. ‘పాలిటిక్స్‌లోకి వస్తే డబ్బులు ఇస్తారు అనే భ్రమల్లో జనం ఉన్నారని.. రాజకీయాల్లోకి రావాలంటే సొంత డబ్బులు ఖర్చు చేసుకోవాలి. ఎవరూ డబ్బులు ఇవ్వరు. ఇక సెలబ్రిటీ లైఫ్ అంటే అడుగడునా కమర్షియల్ అంటూ చెప్పికొచ్చింది.
ఇక తాను బీజేపీలో ఎందుకు చేరింతో క్లారిటీ ఇస్తూ.. బీజేపీలో చేరటం అనేది నా ఇష్టం. అంతమాత్రాన నా వ్యక్తిత్వం చనిపోతుందా? మా ఇంట్లో ఉన్న వాళ్లకు ఒక్కొక్కరికీ ఒక్కో పార్టీ ఇష్టం. నాకు ఈ పార్టీ ఇష్టం అందుకే జాయిన్ అయ్యా.. ఇందులో తప్పేం ఉంది. మీరు ఎంత తిట్టినా నా మనసు మారదు. నా మైండ్ మారదు. పార్టీ వేరు.. పర్సనల్ లైఫ్ వేరు, పార్టీ అనేది మనం పనిచేయడానికి ఎంచుకున్న ప్రొఫెషన్ మాత్రమే రెండింటి మధ్య ఉన్న తేడా తెలుసుకోండి అంటూ ఫేస్ బుక్‌లో తెగ క్లాస్‌లు పీకుతుంది ఒకప్పటికి జనసైనికురాలు.. ప్రస్తుత బీజేపీ యువ నాయకురాలు మాధవీలత.