షాకింగ్ యోగ: గాల్లో తేలిన సన్నజాజి

0

ప్రస్తుతం సెలబ్రిటీలు ఫిట్ నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్న సంగతి తెలిసిందే. కఠోర సాధనతో అందం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తపిస్తున్నారు. శిల్పా శెట్టి.. ఐశ్వర్యారాయ్.. కరీనా కపూర్.. దిశా పటానీ లాంటి స్టార్లు నవతరంలో స్ఫూర్తి నింపుతున్నారు. ఈ భామలు వయసుతో సంబంధం లేకుండా కఠోర వ్యాయామం చేయడం నిరంతరం హాట్ టాపిక్. వీళ్ల బాటలోనే ముంబై బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ కఠోరంగా శ్రమిస్తోంది. లేటెస్ట్ గా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ ఫోటో షాకిస్తోంది. ఇదిగో ఇలా శరీరాన్ని విల్లులా వంచేస్తూ అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తోంది. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఎదిగేయాలని కలగంది. కానీ అనుకున్నదొక్కటి అయినదొక్కటి. ఆశించిన స్థాయి అవకాశమేదీ ఈ అమ్మడిని వరించలేదు. కొత్త తరం హీరోలు.. మంచు కాంపౌండ్ లో ఛాన్సులు తప్ప ఇప్పుడున్న టాప్ 11 అగ్ర హీరోలెవరూ ప్రగ్యకు అవకాశం ఇచ్చిందేం లేదు. దీంతో కెరీర్ పరంగా బోలెడంత డైలమాలో ఉంది.

అయితే ఈ ఖాళీ సమయన్ని మాత్రం తెలివిగా సద్వినియోగం చేసుకుంటోంది. తనకు చిక్కిన టైమ్ ని ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ అందాన్ని కాపాడుకోవడం కోసం వినియోగిస్తోంది. అందుకోసం కఠోరంగా వ్యాయామం చేస్తోంది. దాంతో పాటే యోగాను అంతే సీరియస్ గా సిన్సియర్ గా ప్రాక్టీస్ చేస్తూ మైండ్ ని పూర్తి కంట్రోల్ లో ఉంచుతోంది. యోగ సాధనలో మునీశ్వరులకు ధీటైన ప్రదర్శనతో మైమరిపిస్తోంది. ఇదిగో ఇక్కడ ఈ ఫోజు చూస్తే మీరే ఆ మాట అంటారు. తన శిక్షకుడి సాయంతో ఇలా కఠోర సాధన చేస్తూ కంట పడింది. ప్రస్తుతం ఈ ఫోటో యువతరం సామాజిక మాధ్యమల్లో జోరుగా వైరల్ అవుతోంది.

ఇంతకీ ప్రగ్యకు ట్రైనింగ్ ఇస్తున్నది ఎవరు? అంటే ఆ ట్రైనర్ పేరు సర్వేష్ శశి. ప్రఖ్యాత యోగా శిక్షకుడు. సిటీలో సెలబ్రిటీలందరికీ ఆయన యోగ తరగతుల్ని నేర్పిస్తుంటారు. ఇలా పాదాలపై ప్రగ్యను గాల్లోకి ఎత్తుతూ ఉంటే ఆ ఫీట్ ని బ్యాలెన్స్ చేస్తూ గాల్లోనే నిలిచి ప్రగ్య పెద్ద సాహసమే చేస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీలో బోలెడంత మేకోవర్ కనిపిస్తోంది. మునుపటితో పోలిస్తే బబ్లీ నెస్ తగ్గి ఛామింగ్ గా సన్నజాజి తీగలా కనిపిస్తోంది. కనీసం ఈ హార్డ్ వర్క్ ని గుర్తించి అయినా మన అగ్ర దర్శక హీరోలు ఛాన్సులిస్తారేమో చూడాలి.
Please Read Disclaimer