ఎవరైనా నా కౌగిలిలో నలిగి పోవాల్సిందే! : రెజీనా

0regina-guvva-girinka-songటాలీవుడ్ నటి రెజీనా హాట్ కామెంట్స్ చేశారు. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. పైపెచ్చు ఎవరైనా సరే నా కౌగిలిలో నలిగి పోవాల్సిందేనంటూ ఆమె వ్యాఖ్యానించారు.

డేటింగ్ అంశంపై ఆమె స్పందిస్తూ… ‘రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడమంత కష్టం మరొకటి ఉండదు. నటనలో అనుభవం పెరుగుతోంది కానీ రొమాంటిక్‌ సన్నివేశాలు చెయ్యడానికి ఇప్పటికీ తడబడుతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సన్నివేశాల్ని చెడగొట్టడంలో నా తర్వాతే ఎవరైనా అనుకుంటాను’ అంటోంది.

అయితే, ‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వస్తున్న పుకార్ల విషయంలో ఒక్కటే నమ్ముతాను. ఒకే సమాధానమిస్తాను. తెలిసీ తెలియకుండా పిచ్చి మాటలు మాట్లాడేవాళ్లు ‘మీరు చూసింది నమ్మండి.. విన్నది కాదు’ అని సెలవిచ్చింది.

రొమాన్స్‌కి కాస్త దూరంగా ఉంటానంటున్న ఈ చెన్నై బ్యూటీకి బొమ్మలు, పువ్వులు అంటే అస్సలు నచ్చవట. తన బెడ్‌పై ఉండే తలదిండు అంటే చాలా ఇష్టమట. ‘అవును నాకు పిల్లో అంటే చాలా ఇష్టం. నిద్రపోయే సమయంలో అది నా పక్కనే ఉండాలి. దానిని కౌగిలించుకుని పడుకోవడమంటే ఇంకా ఇష్టం. ప్రతిరోజు తలదిండు నా కౌగిలిలో నలిగిపోవాల్సిందేట’ అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.