శ్రీవారి సేవలో సమంత: మతం మార్చుకుందంటూ ప్రచారం!

0టాలీవుడ్ హీరోయిన్ సమంత త్వరలో అక్కినేని ఇంటి కోడలు కాబోతోంది. అక్టోబర్లో నాగ చైతన్య, సమంత వివాహం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రేమ జంట నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

కాగా… శనివారం ఉదయం సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అయితే క్రిస్టియన్ మతస్తురాలైన సమంత శ్రీనివాసుడి సేవలో తరించడం చర్చనీయాంశం అయింది.

సమంత మరికొన్ని రోజుల్లో నాగ చైతన్యను పెళ్లాడబోతున్న నేపథ్యంలో మతం మార్చుకుందనే ప్రచారం మొదలైంది. ఒక హిందూ కుటుంబానికి కోడలు కాబోతున్న నేపథ్యంలో ఇవన్నీ అలవాటు చేసుకుంటోందని టాక్.

గతంలో సమంత, నాగ చైతన్య కలిసి అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఓ పూజలో పాల్గొన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అప్పుడు కూడా సమంత మతం మార్చుకుందని వార్తలు వచ్చాయి. అయితే అదేమీ లేదని, అలాంటి అవసరం కూడా లేదని నాగ చైతన్య వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తమ మధ్య ప్రేమకు, పెళ్లికి మతం అసలు అడ్డు కానే కాదని…. ఒకరినొకరం ఇష్టపడ్డాం, ఎవరి నమ్మకాలు వారి కుంటాయి, ఒకరి నమ్మకాలను మరొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుతామని నాగ చైతన్య స్పష్టం చేసారు.