బిగుతు బికినీలో 7 గంటల టార్చర్!

0

బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై నటి తనూశ్రీ దత్తా చేసిన సంచలన వ్యాఖ్యలు బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. విలక్షణ నటుడు నానా పాటేకర్ – దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తనపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారని ఆరోపించింది. తనూకు చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు కేంద్ర మహిళా – శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ కూడా బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే. భారత్ లో కూడా “మీ టూ ఇండియా“ఉద్యమం రావాలని ఆమె అన్నారు. ఓ వైపు తనూకు నానా పాటేకర్ లీగల్ నోటీసులు పంపగా….మరోవైపు నానాకు వ్యతిరేకంగా వీడియోలు రిలీజ్ చేసేందుకు తనూ రెడీ అయింది. ఈ క్రమంలో తాజాగా తనూకు మద్దతుగా `తొలిప్రేమ`బ్యూటీ సప్నా పబ్బి గళం విప్పింది.

వరుణ్ తేజ్ `తొలిప్రేమ`లో ఓ సాంగ్ తో ఆకట్టుకున్న సప్నా పబ్బి….తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పింది. బాలీవుడ్ లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని వాటిని సహించకూడదని తన సోషల్ మీడియా ఖాతాలో సప్నా పోస్ట్ పెట్టింది. ఓ చిత్ర షూటింగ్ లో దర్శకుడు – నిర్మాత – తన స్టైలిస్ట్ ఇబ్బందిపెట్టారని తెలిపింది. షూటింగ్ కోసం అసౌకర్యంగా ఉన్న బిగుతైన బికినీ వేసుకోమన్నారని ఆ బికినీ ధరించిన కొద్ది సేపటికి ఎద భాగంలో నొప్పి వచ్చిందని చెప్పింది. ఆ బికినీ మార్చాలని దర్శకుడిని ఎన్నిసార్లు అడిగినా….స్పందించలేదని వెకిలిగా నవ్వాడని చెప్పింది. తన స్టయిలిస్ట్ కూడా అతడితో కలసి నవ్విందని ఆ సమయంలో తాను ఎంతో వేదన అనుభవించానని చెప్పింది. తనకు అవకాశాలు రావేమోనని ఈ విషయం ఎక్కడా చెప్పలేదని తెలిపింది. `24 సిరీస్` లో సప్నాకు ఈ చేదు అనుభవం ఎదురై ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Please Read Disclaimer