బిచ్చగాడు భామకు మరో సారి పెళ్లి

0satna-titus-gets-married‘బిచ్చగాడు’ అనే ఓ డబ్బింగ్ సినిమా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ప్రభంజన సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సినిమాకు హీరో అయిన విజయ్ ఆంటోనీ, ఇప్పుడు తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో స్టార్ హీరో అయిపోగా, హీరోయిన్ సట్నా టైటస్ కూడా మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక బిచ్చగాడును తమిళనాట విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్ అయిన టీ కార్తీక్‌ను, సట్నా గతేడాది సెప్టెంబర్‌లో రహస్యంగా రిజిస్టర్ ఆఫీస్‌లో పెళ్ళి చేసుకున్నారు.

ఇక రిజిస్టర్ మ్యారేజ్‌తో అప్పుడే ఒక్కటైన ఈ జంట, తాజాగా తమ తమ తల్లిదండ్రులను కూడా ఒప్పించి మరోసారి పెళ్ళిచేసుకున్నారు. చెన్నైలో వైభవంగా జరిగిన వేడుకతో ఈ జంట, కుటుంబ సభ్యుల సాక్షిగా మరోసారి భార్యాభర్తలయ్యారు. కార్తీక్ ప్రస్తుతం పలు సినిమాలకు సహ నిర్మాతగా పనిచేస్తూండగా, సట్నా మూడు సినిమాలను లైన్లో పెట్టారు. కార్తీక్ – సట్నా జంటకు Telugunow.com తరపున శుభాకాంక్షలు తెలుపుదాం.