నీ గోకుడు యవ్వరాలు తెలుసు..శ్రీరెడ్డి కామెంట్స్

0శ్రీరెడ్డి నోటికి అడ్డూ అదుపులేకుండా పోతోంది.. రాయలేని అసభ్య పదజాలంతో సినీ ప్రముఖులను విమర్శిస్తోంది. పవన్ కళ్యాణ్ ను తిట్టి పాపులర్ అయిన ఈ భామ కొద్దిరోజులుగా తమిళ సినీ ఇండస్ట్రీపై దండయాత్ర చేసి అక్కడి సినీ ప్రముఖులను బజారు కీడ్చే పనిలో బిజీగా ఉంది. ఇప్పుడు సడన్ గా మళ్లీ టాలీవుడ్ పై పడింది. తాజాగా ప్రముఖ హాస్య నటుడిపై శ్రీరెడ్డి చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి.

శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో కమెడియన్ ఫృథ్వీపై సంచలన కామెంట్స్ చేసింది. ‘బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో నీ గోకుడు యవ్వారాల గురించి తెలియదా’ అంటూ ఆరోపణలు చేసింది. నీ బాగోతం గురించి అమెరికా ఈవెంట్స్ కి వచ్చిన అమ్మాయిలకు కూడా తెలుసు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఫృథ్వీని ముసలి నక్క అని సంబోధిస్తూ శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ఈ ముసలి నక్కకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటా’ అంటూ ఎద్దేవా చేసింది. గురువింద గింజ ******** అక్కడ పెట్టుకో అంటూ రాయలేని తిట్ల తో శ్రీరెడ్డి బూతు వ్యాఖ్యలు చేసింది.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ ఫృథ్వీ శ్రీరెడ్డిపై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ గారి తల్లిని అలా దూషించడం నిజంగా దారుణమని.. తల్లిలేని నాకు తల్లి విలువ తెలుసు అంటూ అన్నాడు. తన దృష్టిలో శ్రీరెడ్డి అసలు ఆడదే కాదంటూ సంచలన కామెంట్స్ చేశాడు. కనీసం ట్రాన్స్ జెండర్ కూడా అలాంటి వ్యాఖ్యలు చేయరని విమర్శించారు. దీంతో ఫృథ్వీ పై కౌంటర్ అటాక్ చేసిన శ్రీరెడ్డి అతడిపై ఫేస్ బుక్ లో దారుణంగా స్పందించింది.