శ్రీదేవి మా అన్నయ్యను కాపాడారు ఓ అభిమాని

0దివంగత నటి శ్రీదేవి తన సోదరుడికి చికిత్స చేయించి ప్రాణం పోశారని జతిన్‌ వాల్మికి అనే అభిమాని తెలిపారు. శ్రీదేవి మరణ వార్త తెలుసుకుని రెండు రోజులుగా ముంబయిలోని ఆమె నివాసం వద్దే తిరుగుతున్నానని పేర్కొన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన జతిన్‌ వాల్మికి దివ్యాంగుడు. కొన్నేళ్ల క్రితం అతని సోదరుడికి బ్రెయిన్‌ ట్యూమర్‌ సోకింది. చికిత్సకు లక్ష రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న శ్రీదేవి జతిన్‌ సోదరుడి చికిత్సకు లక్ష రూపాయలు సాయం చేశారు. అంతేకాదు..ఆస్పత్రిలో కట్టాల్సిన మిగతా లక్ష రూపాయలు కూడా మాఫీ చేయించారు. ఆమెను ఆఖరిసారి చూసేందుకు రెండు రోజుల క్రితమే ముంబయికి వచ్చినట్లు జతిన్‌ తెలిపారు.

ఈరోజు మధ్యాహ్నం 12.30 వరకు శ్రీదేవి పార్థివదేహాన్ని ముంబయిలోని సెలబ్రేషన్స్‌ స్పో్ర్ట్స్‌ క్లబ్‌లో ఉంచుతారు. అనంతరం 2 గంటలకు అంతిమయాత్ర నిర్వహిస్తారు. 3.30 గంటలకు పవన్‌ హాన్స్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. courtesy :eenadu