చలపతి సరే.. ప్రియాంక-శృతిల సంగతేంటి?

0priyanka-shurtiకేరక్టర్ ఆర్టిస్ట్ చలపతి రావు మహిళలపై చేసిన ‘పక్కలోకి పనికొస్తారు’ వ్యాఖ్య పెద్ద దుమారమే రేపుతోంది. స్థానిక మీడియా.. సోషల్ మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా దీనిపై బాగానే రియాక్ట్ అవుతోంది.. వరుస కథనాలు ప్రసారం చేస్తోంది.

అంతే కాదు.. గతంలో నందమూరి బాలకృష్ణ చేసిన ‘కడుపు చేసెయ్యాలి’.. ఆలీ మాట్లాడిన ‘బొడ్డు బెంజ్ సర్కిల్ లా ఉంది’ కామెంట్స్ ను కూడా కలిపి బాగానే రచ్చ చేస్తున్నారు. తప్పు చేసినపుడు ఎత్తి చూపడంలో ఎలాంటి తప్పు లేదు కానీ.. ఈ రూల్స్ అన్నీ కేవలం పురుషులకు మాత్రమే వర్తిస్తాయా.. లేడీ యాక్టర్స్ ఏం మాట్లాడినా పర్లేదా అనే డౌట్ రావడం సహజం. ఈ ఏడాది ప్రారంభంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పురుషులపై దారుణమైన కామెంట్ చేసింది. ‘పిల్లలను కనడానికి మాత్రమే మగాళ్లు’ పనికొస్తారు అనేసింది ప్రియాంక చోప్రా. అప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా దీనిపై స్పందించలేదు.

తాజాగా సౌత్ బ్యూటీ శృతి హాసన్ అయితే.. పిల్లలను కనాలంటే పెళ్లి చేసుకోవాలా అనింది. శృతి చేసిన కామెంట్ ను పర్సనల్ గా భావించినా.. ప్రియాంక చోప్రా మాత్రం మగాళ్లను అవమానించేలా మాట్లాడిన సంగతి మర్చిపోకూడదు. మహిళా సాధికారత.. ఫెమినిజం ముసుగులో ఇలాంటి వ్యాఖ్యలు చేసే లేడీ స్టార్స్ ను మీడియా ఎందుకు ఉపేక్షిస్తుందనే సంగతి ఆలోచించాల్సిందే.