కదలకుండా బొమ్మలా నిలబడ్డ సెక్యూరిటీ గార్డ్ పక్కన డ్యాన్స్ చేసిన నటి ఆదా శర్మ.. మీరూ చూడండి

0



‘స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి’, ‘సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్’ వంటి సినిమాల్లో న‌టించి మెప్పించిన న‌టి ఆదా శర్మ సోష‌ల్ మీడియాలో ప్ర‌తిరోజూ వెరైటీ వీడియోలను పోస్ట్ చేస్తూ అల‌రిస్తుంటోంది. ఈ రోజు ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో వైర‌ల్ గా మారింది. అందులో బొమ్మ‌లా నిల‌బ‌డి ఉన్న‌ ఓ సెక్యూరిటీ గార్డ్ ప‌క్క‌న నిల‌బ‌డి ఆమె డ్యాన్స్ చేసింది. తాను సెక్యూరిటీ గార్డులు అస్స‌లు క‌ద‌ల‌ర‌ని అనుకున్నాన‌ని, అయితే, ఆ వ్య‌క్తి ఒక్క‌సారిగా క‌ద‌ల‌గానే గుండె ఆగినంత ప‌నైంద‌ని ఆమె చెప్పింది. ఆ సెక్యూరిటీ గార్డ్ క‌దలగానే ఆదా శ‌ర్మ మెల్లిగా అక్క‌డి నుంచి జారుకుంది. ఈ వీడియోను మీరూ చూడండి..