అయ్యో.. చక్కనమ్మ వేలు తెగిందే!

0యువకథానాయిక అదా శర్మ స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. నటించిన అరడజను సినిమాలతోనే యూత్లో అసాధారణ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాలతో కంటే వేడెక్కించే ఫోటోషూట్లతో – డ్యాన్సింగ్ వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు టచ్లో ఉంటూ విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. తాను ఏ కొంటె వేషం వేసినా అదా కి అదా ట్విట్టర్ లో ఫ్యాన్స్కి షేర్ చేస్తుంటుంది.

ఇదిగో లేటెస్టుగా అభిమానులకు షాకిచ్చే వేరొక ఫోటోని షేర్ చేసింది. తన చేతి చిటికిన వేలు తెగితే దానికి కట్టు కట్టింది. తగిలిన గాయాన్ని చూపిస్తూ .. ఒకవేళ నాకు తొమ్మిది వేళ్లు మాత్రమే ఉంటే నన్ను అప్పటికీ లవ్ చేస్తారా? అని ప్రశ్నించింది. కార్ డోర్ లో పెడితే వేలు చితికిపోయింది. సంతోషించదగ్గ విషయం ఏమంటే కార్ డోర్ తెరుచుకుంది. మిగతా వేళ్లు అయినా మిగిలాయిలే అనుకున్నా. బ్లెస్సెస్ దక్కాయి.. అని ట్వీట్ చేసింది.

ఈసారి కార్ డోర్ లో ఒక వేలు కాదు పది వేళ్లు పెట్టినా అభిమానులు స్థిరంగానే తనని ప్రేమిస్తారు. ఆ నిజం తనకు తెలియక ఆ కొంటె ప్రశ్న అడిగేసిందేమో! ఏదైతేనేం.. ప్రస్తుతం సినిమాలతో కంటే ఇలాంటి కాలక్షేపం కబుర్లతోనే ఎందుకు టైమ్ పాస్ చేస్తోందో తెలియడం లేదు. ఆ కొంటెతనంలోని లాజిక్ అర్థం చేసుకోవడం మామూలు కుర్రాళ్లకు ఎలానో బుర్రకెక్కడం లేదు.