అత్యంత వింత దుస్తులలో అదా!

0

ఒక మనిషిమీద మనం అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవడంలో ఆ మనిషి డ్రెస్ కీలకపాత్ర పోషిస్తుంది. డ్రెస్ అనేది ఎప్పుడూ పర్సనల్ ఛాయిస్ అనే మాట వాస్తవమే. అందుకే ఒకరి డ్రెస్ ను మనం ఎప్పుడు కించపరుస్తూ మాట్లాడకూడదు. అలా అని పచ్చచొక్కా ఎర్ర ప్యాంటు కాంబినేషన్లో తెల్ల హ్యాటు పెట్టుకుంటే ఎవరైనా కామెంట్ చేస్తారు. ఊరుకోరు. కానీ ఇలాంటివన్నీ తెలిసి కూడా బ్యూటీ అదా శర్మ రీసెంట్ గా ఒక జంబలకిడి పంబ డ్రెస్ వేసుకుంది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసింది.

తన డ్రెస్ ఎలా ఉందంటే.. పింక్ కలర్ జాకెట్.. ఆ జాకెట్ కు జేబులు. ఈ పింక్ కలర్ జాకెట్ పై బంగారు రంగు దారాలతో ఎంబ్రాయిడరీ. ఇవి చాలవన్నట్టు కాలర్.. హ్యాండ్ కఫ్స్ మాత్రం ఆరెంజ్. ఈ జాకెట్ పైన ఇంగ్లీష్ అక్షరాలు కూడా ఉన్నాయి. ఈ జాకెట్ కింద సేమ్ డిజైన్లో ఉండే సేమ్ కలర్ లెహెంగా ధరించింది. జుట్టుకు బ్లూ కలర్ వేసింది. ఈ హంగామాకు తోడుగా సంబంధమే లేకుండా ఎవేవో ఆభరణాలు ధరించింది. దీనికి క్యాప్షన్ గా బాంబర్ జాకెట్ వేసుకున్నానని తెలిపింది. ఇంతకీ ఈ వింత డ్రెస్ ఎందుకు వేసుకున్నట్టు? హలో మ్యాగజైన్ వారి అవార్డు ఫంక్షన్ లో ఫన్ కోసం ఇలా చేశానని చెప్పింది.

నెక్స్ట్ ఫోటోలో రోడ్ పక్కన ఒక పాత షట్టర్ దగ్గర నిలబడి ‘రెడ్ కార్పెట్ రెడీ. మీ ఇష్టం వచ్చిన దుస్తులు ధరించండి. మీకిష్టం వచ్చినట్టు జీవించండి. నిజానికి రేపే చస్తున్నాం అన్నట్టుగా బతకండి. మీకు నచ్చిన చోట పోజివ్వండి’ అంటూ ఒక పొడవాటి క్యాప్షన్ ఇచ్చింది. ఇంతటి ఆగలేదు అదా. ‘అనాకారి అని.. లావు అని.. నలుపని బాడీ షేమింగ్ చేసేవారిని అసలు పట్టించుకోవద్దు. నాకు నచ్చిన దుస్తులు నేను వేసుకుంటా. మీరు కూడా మీకు నచ్చినట్టు ఉండండి.. జనాలను ఎక్కడైనా చావనివ్వండి’ అంటూ చాలా లోతైన ఫిలాసఫీ ఉన్న వింత సందేశం ఇచ్చింది.

ఇప్పుడు అర్థం అయింది కదా ఆ జంబల్ హాట్ డ్రెస్ ఎందుకు వేసుకుందో. ‘నా ఇష్టం మీరేం పీక్కుంటారో పీక్కోండి’ అని కామెంట్లు చేసేవారికి మెసేజ్ ఇచ్చినట్టు..! చిత్రమైన విషయం ఏంటంటే ఇంత వింత డ్రస్ లో కూడా అందాలను ధారపోయడం మరువలేదు. నెటిజనులను సంతోషంపెట్టడం మానలేదు!
Please Read Disclaimer