అమ్మో.. ఈమె ఇంత హాటా?

0Adah-super-hot-looksదీపం ఉండగానే చక్కబెట్టుకోవాలంటారు పెద్దోళ్లు. కానీ ఆదా శర్మ ఆ పని చేయలేకపోయింది. తనకు వరుసగా అవకాశాలు వస్తున్నపుడే ప్రేక్షకుల్ని ఆకర్షించే ప్రయత్నం చేయాల్సింది. కానీ తెలుగులో చేసిన సినిమాల్లో చాలా మామూలుగా కనిపించింది. తనలోని గ్లామర్ కోణాన్ని పెద్దగా చూపించలేదు. దీంతో రెండు మూడు సినిమాలవ్వగానే క్యారెక్టర్ రోల్స్ లోకి మారాల్సి వచ్చింది.

‘సన్నాఫ్ సత్యమూర్తి’.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటి సినిమాల్లో చేసిన చిన్న పాత్రలు ఆమె ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేశాయి. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు ఆగిపోయాయి. వేరే భాషల్లోనూ అమ్మడికి పెద్దగా అవకాశాలు లేవు. ఐతే తనకున్న ట్రెడిషనల్ ఇమేజ్ పోగొట్టుకుని.. తాను కూడా గ్లామర్ డోస్ కావాల్సినంత ఇవ్వగలనని చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది ఆదా. ఈ మధ్య తరచుగా ఆమె హాట్ హాట్‌గా ఉన్న ప్రైవేట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

తాజాగా ఒక ఎయిర్‌పోర్ట్‌లో తీసిన ఫొటో ఒకటి షేర్ చేసింది ఆదా. అందులో క్లీవేజ్ అందాల్ని కళ్లు చెదిరే రీతిలో ఎక్స్‌పోజ్ చేస్తోంది ఆదా. ఏదో ఫొటో షూట్ అంటే ఓకే కానీ.. మరీ ఈ స్థాయిలో అందాల ప్రదర్శన చేస్తూ ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయావా అంటూ కామెంట్లు చేస్తున్నారు జనాలు ఈ ఫొటో చూసి. ఆదా బయటే ఇలా కనిపిస్తోందంటే.. తెరమీద ఇంకెంతగా రెచ్చిపోగలదో అర్థం చేసుకోవచ్చు. మరి ఆమె టాలెంటుకు తగ్గ అవకాశాలు దర్శక నిర్మాతలు ఇస్తారా?