కికి ఛాలెంజ్ కు కిక్కిచ్చిన అదా!

0స్టాలిన్ సినిమాలో చిరంజీవి ఒకరికి సహాయం చేసినప్పుడు ఎవరైనా థాంక్స్ చెప్తే ‘లేదు.. నాకు థాంక్స్ వద్దు ఎవరైనా ముగ్గురికి సహాయం చేయండి.. వాళ్ళను మరో ముగ్గురికి అలా హెల్ప్ చేయమని చెప్పండి’ అంటాడు. కాన్సెప్ట్ బాగుంది కదా.. చూసేందుకు వినేందుకు సూపర్ గా ఉంటుంది. కానీ ఒక్కడైనా ఫాలో అయితే ఒట్టు! కానీ గుమ్మడికాయ చాలెంజ్ అని.. కోడిగుడ్డు కర్రీ చాలెంజ్ అని.. బీరు-బిర్యాని చాలెంజ్ అని పెట్టండి.. జనాలు తమ పనులన్నీ మానేసి అదే పని గా చాలెంజ్ ని స్వీకరించి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేంతవరకూ నిద్రపోరు!

ఈమధ్యనే కొత్తగా ‘కికి ఛాలెంజ్’ అనే పేరుతో ఓ డాన్స్ ఛాలెంజ్ సెలబ్రిటీలకు తగులుకుంది. పాపులర్ కెనడియన్ సింగర్ డ్రేక్ కొత్త ఆల్బమ్ ‘స్కార్పియన్’ లో ‘ఇన్ మై ఫీలింగ్స్’ అనే పాట ఒకటి ఉంది… అందులో “కికి.. డు యు లవ్ మీ’ అనే పదాలున్నాయి. కానీ అయన కాదు ఈ ఛాలెంజ్ ని మొదలెట్టింది. కమెడియన్ షిగ్గి. అనే ‘ఇన్ మై ఫీలింగ్స్’ పాటకు డాన్స్ వేశాడు. ఆ తర్వాత అది వైరల్ అయింది. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. మొదట్లో ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం కికి ఛాలెంజ్ లో ఒక వెహికల్ నుండి దిగి డాన్స్ వేసి మళ్ళీ వెహికల్ ఎక్కాలి.. కొందరు ఈ తంతు మూవింగ్ వెహికల్ నుండి చేస్తుండడంతో కొన్ని దేశాలు బ్యాన్ చేశాయని కూడా సమాచారం.

ఇదంతా పక్కన బెడితే మన అదా శర్మ దగ్గరకు ఈ కికి ఛాలెంజ్ వచ్చింది. దాంతో ‘ఇన్ మై ఫీలింగ్స్ పాటకు ట్రెడిషనల్ డాన్సర్ డ్రెస్ లో కథక్ డాన్స్ చేసింది. కారు నుండి దిగి నాట్యం చేసి ఆ తర్వాత కారెక్కింది. మూవింగ్ కారు కాదు లెండి.. జస్ట్ ఆగి ఉన్న కారు. కానీ ఫుల్లు హాటు గా ఉండడంతో నెటిజనులకు టెంపరేచర్ పెరిగింది. అసలే హాట్ బ్యూటీ.. కికి ఛాలెంజ్ అంటూ డాన్స్ చేసింది.. మరి అందరూ ఈ ‘కికి చాలెంజ్’ ను మొదలు పెడతారో ఏమో.. ! మరి ఇంకెందుకాలస్యం మీరూ ఆ వీడియో పై ఓ లుక్కేయండి.