RRR: అప్పుడే ఇన్స్పిరేషన్ అంటున్నారే!

0

ఎస్ ఎస్ రాజమౌళి సినిమా అంటే చాలు.. దానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలని ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది. అధికారికంగా ఎన్ని అప్డేట్లు వచ్చినప్పటికీ వాటికి తోడుగా ఎన్నోస్పెక్యులేషన్స్ కూడా జోరుగా ప్రచారంలో ఉంటాయి. తాజాగా అలా ప్రచారంలోకి వచ్చిన విషయం ఏంటంటే ఈ సినిమాలో ఒక ట్రాక్ మాత్రం రాజమౌళి పాత తెలుగు సూపర్ హిట్ డవి రాముడు’ నుండి ఇన్ స్పయిర్ అయ్యి డిజైన్ చేసుకున్నాడట.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కు ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. వీరిద్దరిలో ఒకరు అడవిలో ఉండే భామ అయితే మరో అమ్మాయి మాత్రం విదేశీ మహిళ అని అమాచారం. సరిగ్గా ఈ ట్రాక్ ‘అడవి రాముడు’ లో సీనియర్ ఎన్టీఆర్ లవ్ ట్రాక్ ను పోలి ఉంటుందని అంటున్నారు. ‘అడవి రాముడు’ లో జయసుధ అడవిలో ఉండే అమ్మాయి కాగా జయప్రద పట్నం అమ్మాయి. ఈమధ్య మలయాళీ బ్యూటీ నిత్యా మేనన్ పేరును పరిశీలించింది అడవిలో ఉండే భామ పాత్ర కోసమేనట.

రాజమౌళి సినిమాలకు ఇలా ఇన్స్పిరేషన్ తీసుకున్నాడని వార్తలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. కాకపోతే గతంలో సినిమా రిలీజ్ అయ్యాక వచ్చేవి. ఇప్పుడు షూటింగ్ దశలో ఉండగానే అలాంటి స్పెక్యులేషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ ‘అడవి రాముడు’ ప్రేరణ నిజమో కాదో తెలియాలంటే RRR రిలీజ్ అయ్యేవరకూ వేచి చూడక తప్పదు.




Please Read Disclaimer