ఫస్ట్ లుక్: బంటీ అదుగో!

0జంతువులు ప్రధాన పాత్రలలో నటించే సినిమాలు మనకు కొత్తకాదు. పాము – ఏనుగు – ఈగ ఇలా చెప్పకుంటూ పొతే చాలా జంతువులు మనల్ని సినిమాల్లో అలరించాయి. ఎన్ని జంతువులు అలా అలరించినా ఒక పిగ్లెట్(పందిపిల్ల) ప్రధాన పాత్రలో నటించిన సినిమా మాత్రం రాలేదు. తెలుగులోనే కాదు టోటల్ గా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే రాలేదు. అలా పందిపిల్ల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అదుగో’.

విభిన్న చిత్రాల దర్శకుడు రవి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘అదుగో’ ఫస్ట్ లుక్ ఈరోజే రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ లో పందిపిల్ల పేరు బంటీ అని తెలిపారు. ఇక పింక్ మూతి – వైట్ జుట్టుతో బంటీ భలే క్యూట్ గా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ మాత్రమే కాకుండా యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమా కావడంతో ఈ సినిమాను ఇతర భారతీయ భాషలలో కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారాట. ఇతర భాషల్లో ఈ సినిమా టైటిల్ ను ‘బంటీ’ అని ఫిక్స్ చేశారట.

ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా కథ అందించి నిర్మించాడు రవిబాబు. సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాకు బ్యాకప్ అందించడం ప్రమోషన్స్ – రిలీజ్ విషయంలో కలిసొచ్చే అంశమే. ఈ సినిమాలో అభిషేక్ వర్మ – విభ లు ఇతర ముఖ్యపాత్రలలో నటించారు. ప్రశాంత్ విహారి ఈ సినిమాకు సంగీత దర్శకుడు.