అదుగో బంటీ ఇదుగో

0డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కే సినిమాలకు ఎప్పుడూ రిస్క్ ఫ్యాక్టర్ కాస్త ఎక్కువే ఉంటుంది. అయినా ఇప్పుడు తెలుగులో డిఫరెంట్ కంటెంట్ ఉండే సినిమాలకు ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. మరి అలాంటి వారి కోసమే డైరెక్టర్ రవిబాబు ‘అదుగో’ అనే సినిమాతో ముందుకొస్తున్నాడు. ఈ సినిమాలో పంది పిల్ల ఒక కీలపాత్రలో కనిపిస్తుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ లో పంది పిల్ల ను పరిచయం చేసి దాని పేరును ‘బంటీ’ అని చెప్పారు. తాజాగా ఫిలిం మేకర్స్ టీజర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

ఒకటిన్నర నిముషం నిడివిగల ఈ టీజర్ లో సినిమా స్టోరీని ఏమాత్రం రివీల్ చేయకుండా బంటీ ని మాత్రం చూపించారు. బంటీ ఎక్కడున్నావ్? దొంగా.. నువ్వెక్కడున్నావో నాకు తెలుసు.. బయటకు రా.. అని ఒక అబ్బాయి ప్రేమగా బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో పిలిస్తే మెల్లగా సోఫా వెనకనుండి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది బంటీ. ఇక ‘గుడ్ బాయ్ బంటీ’ అని మెచ్చుకొని ఆ అబ్బాయి చెప్పినట్టు చేస్తుంది. మన ఇంట్లో పెట్ మనం చెప్పినట్టు చేస్తుంది కదా సేమ్ అలాగే.

‘రోల్’ అంటే లెఫ్ట్ కు రోల్ అవుతుంది.. మళ్ళీ ‘రోల్’ అంటే రైట్ కు రోల్ అవుతుంది. ఇక ‘స్టాండ్ అప్’ అంటే ముందుకాళ్ళు పైకి లేపి వెనక కాళ్ళపై నిలబడుతుంది. ఇక డ్యాన్సు వేయమంటే మొదటి స్టెప్ సరిగ్గానే వేసినా..రెండు క్షణాల తర్వాత వెనక్కుతిరిగి నడ్డి ఊపుతూ అల్లరి చేస్తుంది. ‘ఏంటా పిచ్చి డ్యాన్సు?’ అని కసిరితే అప్పుడు ఒకటి రెండు మంచి స్టెప్స్ వేసి మళ్ళీ నడ్డి ఊపుడు స్టెప్ ను అందుకుంటుంది…

అవుట్ డేటెడ్ లౌడ్ కామెడీలు.. సీమ రక్తాలు.. మూతి ముద్దుల హంగామా మధ్య ఈ అల్లరి బంటీ ఎలా నెట్టుకొస్తుందో వేచి చూడాలి!

డీ. సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాలో అభిషేక్ వర్మ – నభ నటేష్ లు లీడ్ యాక్టర్స్. ఈ అల్లరి బంటీ పిల్ల ట్రైలర్ సెప్టెంబర్ 12 న రిలీజ్ అవుతుందట.