ఇజం భామకు తెలుగులో మరో ఛాన్స్

0Aditi-Aryaఒక్కోసారి ఎందుకోగాని.. చాలా హైపుతో వచ్చిన హీరోయిన్లు ఒక్క సినిమాకే కనిపించకుండా పోతారు. వాళ్ళ బ్యాగ్రౌండ్ చూస్తే మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. మిస్ ఇండియా కిరీటాలను గెలిచినవారై యుంటారు. కాని ఎందుకో ఇక్కడ మాత్రం ఒక్క సినిమాతోనే అవుట్. అప్పుడెప్పుడో రాజశేఖర్ తో నటించిన నేహా ధూపియా.. తరువాత పంజా లో చేసిన సారా జేన్ డయాజ్.. ఇదే బాపత్తు. ఇప్పుడు మరో మిస్ ఇండియా కూడా అలాగే అవుతుందేమో అనుకుంటే.. టాలీవుడ్ పిలిచి మరీ రెండో ఛాన్సు ఇచ్చిందిలే.

‘ఇజం’ సినిమాతో టాలీవుడ్ ప్రవేశం చేసింది 2015 మిస్ ఇండియా.. అదితి ఆర్య. అమ్మడికి ఎందుకో బాలీవుడ్లో మాత్రం అస్సలు ఆఫర్లే రావట్లేదు. దానికి తగ్గట్లు మిస్సిండియా పోటీల్లో బికినీల్లో గ్లామర్ ను ఆరబోసినప్పటికీ.. అమ్మడు ఇక్కడ సినిమా తెరపై మాత్రం గ్లామర్ అంటే కష్టం అని చెప్పడంతో ఒకింత అవకాశాలు ఈమెను వెతుక్కుంటూ రావట్లేదు. అయితే ఇజం ఫ్లాపు కాబట్టి.. టాలీవుడ్లో ఇంకో ఛాన్స్ కష్టమే అనుకుంటున్న సమయంలో.. హవీష్ హీరోగా రూపొందుతున్న ”నిన్నువదిలి నేనుపోలేనులే” సినిమాలో ఈమెను ఒక హీరోయిన్ గా తీసుకున్నారు. కాకపోతే ఈమె ఒక్కత్తే హీరోయిన్ కాదు.. ఈ సినిమాలో ఇంకా ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. అది సంగతి.

నిజంగానే ఎందుకు ఐశ్వర్య రాయ్.. ప్రియాంక చోప్రాలు తప్పించి.. అసలు మిస్సిండియాలో ఈ మధ్య కాలంలో భారతదేశంలో పెద్దగా క్లిక్కే కావట్లేదు. వీరు ఎంత హాటుగా ఉన్పటికీ వీరికి ఛాన్సులు మాత్రం దొరకట్లేదు. దొరికినా కూడా ఆ సినిమాలు వీరికి బ్రేక్ తేవట్లేదు. శోభిత ధూలిపాళ.. ఉర్వశి రౌతేలా.. వాన్యా మిశ్రా.. పూజా చోప్రా.. మనస్వి మంగాయ్.. పార్వతి ఓమ్నకుట్టన్.. సిందూర్ గద్దె.. అబ్బో ఈ లిస్ట్ అంతా ఖాళీగానే ఉంది మాష్టారూ.