శేష్ అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి

0

అడివి శేష్ కొద్దిరోజుల క్రితం ఒక గుడ్ న్యూస్ చెప్తానని.. ప్రస్తుతానికి అది సస్పెన్స్ అని ట్విట్టర్ ద్వారా ప్రకటించడంతో హీరోయిన్ ఈషా రెబ్బా “ఏంటి పెళ్లి గురించి చెప్తావా?” అంటూ ఫన్నీగా అడిగింది. దానికి సీరియస్ ఎమోజితో జవాబిచ్చాడు. సో ఆ న్యూస్ ‘పెళ్లి’ కాదని అప్పుడే తేలిపోయింది. కానీ టాలీవుడ్ జనాలు ఊరుకోరు కదా. అది పెళ్లి గురించి అనే రూమర్లు పుట్టించారు.

ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మహేష్ బాబు బ్యానర్ లో నిర్మించనున్న ఫస్ట్ సినిమాకు హీరోగా అడివి శేష్ ను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని అందరికంటే ముందు తుపాకీనే వెల్లడించింది. కానీ సోషల్ మీడియాలో రచ్చ మాత్రం అసలు ఆగలేదు. కొందరి రెండు అడుగులు ముందుకేసి నాగార్జున మేనకోడలు సుప్రియను వివాహం చేసుకోబోతున్నాడని కూడా అన్నారు. ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా రాసిపారేశారు. దీంతో గుడ్ న్యూస్ సంగతి దేవుడెరుగు.. ముందు గుడ్ క్లారిటీ ఇవ్వాలి అన్నట్టుగా అడివి శేష్ తన ట్విట్టర్.. ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా తన ఫోకస్ సినిమాలపైనే అని.. ‘ఇంకేం లేదు’ అని క్రిస్టల్ క్లియర్ గా క్లారిటీ ఇచ్చాడు. తన మెసేజి లో ఎక్కడా పెళ్ళి అనే పదం.. సుప్రియ కు సంబంధిన ప్రస్తావన మాత్రం అసలు తీసుకురాకుండా క్లారిటీ ఇచ్చాడు.

అయినా ఇంకా కొంతమంది జనాలు ఈ రూమర్లకు అడ్డుకట్ట వేయడం లేదు. ఏదేమైనా అడివి శేష్ సదరు ‘గుడ్ న్యూస్’ ఏంటో చెప్పి ఇవన్నీ రూమర్లు అని ఓపెన్ గా చెప్తేగానీ మొద్దు బుర్రలకు ఎక్కదేమో. శేష్ బాబు.. నువ్వు ఎన్నారై కాబట్టి అలా ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చావు కానీ మన జనాలకు అలా కుదరదు .. ఘాటుగా సమాధానం ఇస్తే గానీ వినేలా లేరు గూఢచారి బాబూ..!
Please Read Disclaimer