యూట్యూబ్ రికార్డ్స్ ను తిరగరాస్తున్న అజ్ఞాతవాసి టీజర్

0పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి టీజర్ యూట్యూబ్ రికార్డ్స్ ను తిరగరాస్తోంది. ఇప్పటికే తెలుగుతో అతి తక్కువ సమయంలో అత్యధిక మంది వీక్షించిన టీజర్ గా, అత్యధిక లైక్ లు సాధించిన టీజర్ గా అజ్ఞాతవాసి రికార్డ్ సృష్టించింది. తాజాగా దక్షిణాదిలోనూ పవన్ సినిమా టీజర్ జోరు కనిపిస్తోంది. ఈ టీజర్ సౌత్ ఇండియాలో 24 గంటల్లో అత్యధిక లైక్ లు సాధించిన టీజర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

విజయ్ హీరోగా నటించిన మెర్సల్ టీజర్ కు అత్యధికంగా ఏడు లక్షల నలబై వేలకు పైగా లైక్ లు రాగా అజ్ఞాతవాసి టీజర్ నాలుగు లక్షలకుపైగా లైకుల వచ్చాయి. తెలుగు సినిమా చరిత్రలో ఇదే రికార్డ్ కాగా.. దక్షిణాదిలో మాత్రం సెకం‍డ్ ప్లేస్ సాధించింది. అజ‍్ఞాతవాసి తరువాతి స్థానాల్లో సూర్య తాన‌ సేరంద కూటం, అజిత్ వివేగం, రజనీ కబాలి టీజర్లు ఉన్నాయి.