“అజ్ఞాతవాసి” ప్రీమియర్ షో కి నిరాకరించిన ప్రభుత్వం

0agnyathavasi-premier-showపవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా ప్రీమియర్ షోలకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. అర్థరాత్రి తర్వాత ప్రీమియర్ షోలు ప్రదర్శించకూడదంటూ థియేటర్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. పవన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రీమియర్ షోలకు భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉందని, అందుకే అర్ధరాత్రి తర్వత ప్రీమియర్ షోలకు అనుమతి నిరాకరించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

‘అజ్ఞాతవాసి’ ప్రీమియర్ షోల కోసం భ్రమరాంబ, మల్లికార్జున, ఆర్కే థియేటర్లు పోలీసులు అనుమతి కోరిన నేపథ్యంలో భద్రత కారణాల వల్ల పోలీసులు నిరాకరించారు. గతంలో కూడా ప్రీమియర్ షోలు వేసినప్పుడు పలుచోట్ల తొక్కిసలాటలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అభిమానులు సహకరించాలని పోలీసులు కోరారు.

ఏపీలో రోజుకు ఏడు షోల చొప్పున ‘అజ్ఞాతవాసి’ ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై పవర్‌స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.