ముగ్గురు భామలతో మెగాస్టార్ ఆటలు

0Uyyalawada-Biopicఖైదీ నంబర్ 150తో కమర్షియల్ మూవీని 100 కోట్ల షేర్ మార్క్ దాటించడం సాధ్యమే అని టాలీవుడ్ కి చాటిన మెగాస్టార్ చిరంజీవి.. తన 151వ చిత్రం ప్రారంభించేందుకు రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తుండగా.. గ్రాండ్ గా మూవీ లాంఛింగ్ కు ప్లాన్ చేసుకుంటున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి.. నిర్మాత రామ్ చరణ్.

ఇప్పటికే ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించి క్యాస్టింగ్ ను దాదాపుగా ఫైనల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరో పాత్రకు ఇద్దరు భార్యలు ఉంటారని.. మరో మహిళతో కూడా సన్నిహిత సంబంధాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ పాత్రల కోసం ముగ్గురు భామలను నిర్ణయించుకున్నారట. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్.. టాలీవుడ్ స్వీటీ అనుష్కలతో పాటు సౌత్ సెన్సేషన్ నయనతారలు ఈ మూడు రోల్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరితో చర్చోపర్చలు పూర్తయిపోయాయని అంటున్నారు. మూవీ లాంఛింగ్ టైంలోనే వీరి పేర్లను అనౌన్స్ చేస్తారట.

వాస్తవానికి ఉయ్యాలవాడపై తెలిసిన చరిత్ర కొంతే ఉన్నా.. దాని ఆధారంగా సినిమాటిక్ స్క్రీన్ ప్లే సిద్ధం చేశారట సురేందర్ రెడ్డి.. పరుచూరి బ్రదర్స్. చారిత్రక చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ కు ఏ మాత్రం ఢోకా ఉండదని.. పాటలు ఫైట్స్ ఫుల్లుగా దట్టిస్తారని తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ్.. మలయాళం.. హిందీ భాషల్లో కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని రిలీజ్ చేయబోతున్నారు.