ఫ్యాషన్ ఈవెంట్ లో మెరిసిన ఐష్

0

జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టుకున్నా అందమే’నని తెలుగు సామెత. అందమైన పిల్ల ఎలా ఉన్నా అందమే అయినప్పుడు ప్రపంచ సుందరి కిరీటాన్నే గెలుచుకున్న ఐశ్వర్య రాయ్ కూడా అదే సూత్రం వర్తిస్తుంది కదా. నలభైల్లో ఉన్నా.. ఓ పాపకు తల్లి అయినా ఐష్ అందం మాత్రం చెక్కుచెదరలేదు.

తాజాగా ఖతార్ దేశపు రాజదాని దోహాలో ఫ్యాషన్ వీకెండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్లో ఐశ్వర్య పాల్గొంది. వయసు ఎక్కువని జనాలు అనుకోవాల్సిందే గానీ ఐశ్వర్య మాత్రం మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్ లో దర్శనమిచ్చి అందరి మనసు దోచింది. ఈ ఈవెంట్ లో ఐశ్వర్య తన ముద్దుల కూతురు ఆరాధ్య తో కలిసి పాల్గొనడం విశేషం. ఇక ఫ్యాషన్ ఈవెంట్ లో ఐష్ ఫోటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఈమధ్య కాస్త చబ్బీ గా కన్పిస్తున్న ఐష్ స్లిమ్ లుక్ లోకిమారి 90 లలోని ఐశ్వర్యను గుర్తుకు తెచ్చింది. అంతే కాదు క్లీవేజ్ షోలో కూడా ఏమాత్రం పొదుపు పాటించకుండా అందాలను ధారాళంగా ధారపోసింది.

ఇక సినిమాల విషయానికి వస్తే ఐశ్వర్య చివరిగా ‘ఫ్యానీ ఖాన్’ అనే చిత్రంలో నటించింది. రెండు మూడు నెలలక్రితం రిలీజ్ అయిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. ఐష్ నెక్స్ట్ ఫిలిం పై ఇంకా క్లారిటీ లేదుగానీ ఇప్పుడు స్లిమ్ లుక్ లో ఉంది కాబట్టి కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer