షాక్: ఐశ్వర్యారాయ్ కిడ్నాప్డ్

02018 మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో `ఫనే ఖాన్` ఒకటి. ఈ సినిమాలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ అద్భుతమైన పాత్రలో నటిస్తోందని ప్రచారం సాగుతోంది. సీనియర్ నటుడు అనీల్ కపూర్ – రాజ్ కుమార్ రావ్ – దివ్యా దత్ లాంటి అగ్రతారాగణం నటిస్తుండడంతో మరింత హీట్ పెరుగుతోంది. తాజాగా `ఫనే ఖాన్` ప్రమో రిలీజైంది. కేవలం కొన్ని సెకన్ల నిడివి మాత్రమే ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠ పెంచుతోంది.

ఐశ్వర్యారాయ్ ని అనీల్ కపూర్ – రాజ్కుమార్ రావ్ బృందం కిడ్నాప్ చేశాక ఏం జరిగింది? అన్న కాన్సెప్టును ఈ ప్రోమోలో ఆవిష్కరించారు. కిడ్నాపర్ల మధ్య సంభాషణలు ఎంతో ఫన్నీగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా ఒరిజినల్ స్క్రిప్టుతో రూపందుతోందా? అంటే కానేకాదని ప్రచారమవుతోంది. ఆస్కాన్ నామినేటెడ్ డచ్ సినిమా `ఎవ్వెరిబడీస్ ఫేమస్` (2000) స్ఫూర్తి అని తెలుస్తోంది. హాలీవుడ్ లో జోస్ డి పావ్ – ఎవా వాన్ గుచట్ – వెర్నెర్ డి – తెక్లా వంటి నటీనటులు నటించారు. వీళ్లకు రీప్లేస్ మెంట్ గా బాలీవుడ్ లో క్రేజీస్టార్లను ఎంపిక చేసుకుని తెరకెక్కిస్తున్నారు.