ఐష్ కు మెరిల్ స్ట్రీప్ అవార్డ్

0మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ కి అవార్డులు రివార్డులకు కొదవేం లేదు. కెరీర్ లో ఎన్నో పురస్కారాల్ని ఖాతాలో వేసుకున్న మేటి కథానాయిక. తాజాగా మరో అరుదైన పురస్కారాన్ని దక్కించుకుని టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఐసూ ఓ బిడ్డ తల్లి అయ్యాక కూడా మునుపటి చరిష్మాని మెయింటెయిన్ చేయడం హాలీవుడ్ వీధుల్లోనూ హాట్ టాపిక్ అయ్యింది.

అమెరికా రాజధాని వాషింగ్టన్లో శనివారం నిర్వహించిన విఫ్ట్(వుమెన్ ఇన్ ఫిలింస్ అండ్ టిలివిజన్) అవార్డ్స్ లో ఐష్ కు ప్రత్యేకించి మెరిల్ స్ట్రీప్ పురస్కారం దక్కింది. భారతదేశం నుంచి ఈ అవార్డు అందుకున్న ఏకైక సెలబ్రిటీ ఐశ్వర్య రాయ్. ఈ వేడుకల్లో తన తల్లి బృందా రాయ్ – కుమార్తె ఆరాధ్యతో పాల్గొంది. ఇక ఇదే అవార్డు వేడుకల్లో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె ధడక్ ఫేం జాన్వీ కపూర్ ఎమిరాల్డ్ అవార్డు అందుకుంది.

ఇక ఐశ్వర్యారాయ్ ఇటీవలే ఫనేఖాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది. అభిషేక్ బచ్చన్ తో కలిసి వేరొక చిత్రంలో నటించేందుకు సన్నాహాలు చేస్తోంది. క్రిష్ 4 చిత్రంలోనూ ఐష్ పేరు పరిశీలనలో ఉందన్న చర్చ ఇటీవల తెరపైకొచ్చింది. మరోవైపు ఐష్ ఫిట్ నెస్ పరంగానూ ఇతర నాయికలకు ఠఫ్ కాంపిటీషన్ ఇవ్వడం చర్చకొచ్చింది.