అందానికి ఐశ్వర్యం జతచేస్తే!!

0

అనగనగ ఓ అందాల రాకుమారి కాలంతో పాటే వయసు మీరి వృద్ధురాలు అయిపోయింది. అయితే తన వృద్ధాప్యాన్ని అద్దంలో చూసుకునేందుకే భయపడేది. తన అందాన్ని శాశ్వతం చేయాలంటే వృద్ధాప్యం అన్నదే లేని శాశ్వత అందగత్తెగా మారాలంటే కొన్ని క్షుద్ర పూజలు చేయాలని తాంత్రికుడు చెబుతాడు. ఆ క్రమంలోనే నరబలిని కోరతాడు. ఒక అందమైన యువకుడిని గురు పౌర్ణమి రోజు బలివ్వాలని తాంత్రికుడు డీటెయిలింగ్ ఇస్తాడు. ఆ ప్రకారమే బలి క్రతువు కోసం ఏర్పాట్లు చేస్తుంది రాకుమారి. ఆ తర్వాత ఏమైంది? అంటే .. అది సక్సెసై ఇలా వయసు కనిపించనివ్వని ఐశ్వర్యారాయ్ అయ్యిందేమో అని చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

40 ప్లస్ వయసులోనూ ఇంకా 20లో అడుగుపెడుతున్న టీనేజీ గాళ్ లానే కనిపిస్తోంది ఐశ్వర్యారాయ్. ఇంతందం ఎలా సాధ్యం ఐసూ? అని యూత్ మైండ్ ని సందేహం అదే పనిగా తొలిచేయకుండా ఉండదు. అందంగా పుట్టడమే కాదు ఆ అందాన్ని మెయింటెయిన్ చేయడం ఎలానో .. స్కిన్ కలర్ ని ఎలా కాపాడుకోవాలో ఐసూ దగ్గర మాత్రమే ఆ సీక్రెట్ దాగి ఉంది.

ఐసూ అందం గురించి వర్ణించాలంటే మామూలు కవులు సరిపోరు. కాళిదాసుల్ని – షెల్లీ – జాషువాల్ని దించాలి. అదంతా సరేకానీ – ప్రస్తుతం తన కెరీర్ సంగతేంటి? ఆరాధ్య అప్పుడే వేగంగా ఎదిగేస్తూ పెద్దది అయిపోతోంది. తనని కూడా స్టార్ ని చేయాలని మామ అమితాబ్ – హబ్బీ అభిషేక్ ఇద్దరూ పోటీపడుతున్నారు. మరి ఐసూ మైండ్ లో ఎలాంటి ఆలోచన ఉందో తెలియాల్సి ఉంది. అన్నట్టు కూతురు ఆరాధ్య హైస్కూల్ స్టాండార్డ్ కి ఎదిగేస్తోంది. అటుపై కాలేజ్ లెవల్ కి ఎదిగేసి స్టార్ అయినా ఐష్ అప్పటికీ ఇలానే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్ లో రేఖ – హేమ మాలిని తర్వాత మళ్లీ ఆ రేంజులో చివరి శ్వాస వరకూ అదే అందాన్ని మెయింటెయిన్ చేయడం ఐశ్వర్యారాయ్ కే సాధ్యపడుతుందేమో!?
Please Read Disclaimer