ఐష్ ‘ప్లాస్టిక్’ అందమా?

0మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ అందచందాల గురించి ఎంతో ఊహించాం. అలాంటి అందం ఇలలో మళ్లీ పుట్టే అవకాశం లేదని భావించాం. దీనిపై యూత్ లో ఆల్వేస్ హాట్ డిబేట్ నడుస్తూనే ఉంటుంది. అయితే ఐసూ అందం నేచురల్ కాదా? ఆ అందం ప్లాస్టిక్ అందమా? సర్జరీ చేశాక పుట్టుకొచ్చిన దివ్య రూపమా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇదిగో..

విశ్వసుందరిగా ఆవిర్భవించక ముందు ఐశ్వర్యారాయ్ తన ముఖంలో కొద్దిపాటి మార్పులు చేయించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించిందని అప్పట్లో మీడియాలో పలు కథనాలు హైలైట్ అయ్యాయి. ఇదే విషయంపై చాలా కాలంగా బాలీవుడ్ మీడియాలో డిబేట్ నడిచింది. ఆ క్రమంలోనే ఇదే విషయమై ఐసూనే అడిగితే ప్రతిసారీ దాటవేస్తూ వచ్చేది. తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాన్న దాంట్లో నిజం ఉందని కానీ లేదని కానీ చెప్పలేదు ఐష్.

ఇదివరకూ కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహార్ ప్రశ్నించినప్పుడు ఐశ్వర్యారాయ్ ముక్తసరిగా సమాధానమిచ్చారే కానీ సరిగా ఆన్సర్ ఇవ్వలేదన్న చర్చ సాగింది. ప్రస్తుతం మరోసారి ఐష్ ప్లాస్టిక్ సర్జరీ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. లేటెస్టుగా మరోసారి దీనిపై స్పందించిన ఐష్.. ఈసారి కూడా సేమ్ టు సేమ్ ఆన్సర్ ఇచ్చింది. ప్రతి ఒక్కరికి వాళ్లకు ఉండే ఛాయిస్ వాళ్లకు ఉంటుంది. 20 ఏళ్ల క్రితం ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఇదే చెప్పాను. అందం కాపాడుకోవడం కోసం మేం ఎంతో చేస్తుంటాం. ఆహార నియమాల నుంచి ప్రతిదీ పాటిస్తామని ఐష్ డొంక తిరుగుడుగా సమాధానమిచ్చింది. అయితే ఐష్ ఒకవేళ నిజంగానే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అంత అందగత్తెగా మారినా అభిమానులకు దానిని పట్టించుకునే టైమ్ లేదు. తనని ఓ ఆరాధ్య దేవతగానే భావించి ఆరాధిస్తుంటారనడంలో సందేహం లేదు.