ఆర్ ఎక్స్ 100 దర్శకుడికి ప్రభాస్ ఏమవుతాడు?

0అజయ్ భూపతి.. ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశం అవుతున్న పేరు. సంచలన వసూళ్లతో దూసుకెళ్తున్న ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాను రూపొందించిన ఈ యువ దర్శకుడే. రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన అజయ్.. తొలి ప్రయత్నంలోనే సెన్సేషనల్ హిట్ కొట్టాడు. టాలీవుడ్ నిర్మాతల నుంచి అతడికి మంచి మంచి ఆఫర్లు వస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ దర్శకుడు టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ప్రభాస్ కు బంధువు అవుతాడట. వీళ్లిద్దరికీ దూరపు బంధుత్వం ఉందట. ఈ విషయంలో అజయ్ గురువు రామ్ గోపాల్ వర్మ కొన్నిరోజుల కిందటే హింట్ ఇచ్చాడు. అజయ్ కి.. ప్రభాస్ కు ఏమైనా రిలేషన్ ఉందా అంటూ ఒక ప్రశ్న సంధించి సోషల్ మీడియాలో జనాల్ని అయోమయంలో పడేశాడు.

దీనిపై తర్వాత వర్మ ఏ వివరణా ఇవ్వలేదు. ఐతే ఇప్పుడు స్వయంగా అజయే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ తనకు దూరపు చుట్టం అవుతాడన్నాడు. తన కజిన్ వైఫ్ ప్రభాస్ బంధువు అని.. అలా తమకు బంధుత్వం కలిసిందని.. అంతకుమించి ఏమీ లేదని అజయ్ తెలిపాడు. తాను ఇంత వరకు ప్రభాస్ ను కలవనే లేదని.. త్వరలో కలిసే ప్రయత్నం చేస్తానని అజయ్ చెప్పాడు. తన గురువు వర్మ స్థాయిలో కాకపోయినా తొలి సినిమాలో అజయ్ కూడా బలమైన ముద్రే వేశాడు. కొత్త హీరో హీరోయిన్లను పెట్టి చాలా బోల్డ్ గా ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా తీశాడు. ఆసక్తికరప్రోమోలతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ తెచ్చిన ఈ చిత్రం అనూహ్యమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను రూ.2.5 కోట్లకు అమ్మితే ఇప్పటికే దానికి నాలుగు రెట్ల దాకా షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించిందీ సినిమా.