అజయ్ ఫ్యాన్ ఆత్మహత్యాయత్నం

0Ajay-Devgn-fan-suicide-atteఈ కుర్రాడికి ఒకటే కోరిక… తన అభిమాన నటుడిని కలుసుకోవాలని. దానికోసం ఎంతదూరం అయినా వెళ్లాలని భావించాడు ఆ కుర్రాడు. అభిమాన హీరోని కలుసుకునే అవకాశం దక్కకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బావిపైకి ఎక్కి హల్ చల్ చేసాడు. ఈ రేంజ్ లో హీరోలపై అభిమానాలు ఉన్న కుర్రాళ్లకు మనదేశంలో కొదవేమీ లేదు. వారు అభిమానించే హీరోలకోసం జరిగిన కొట్లాటల్లో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు కదా!

వివరాళ్లోకి వెళ్తే… బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్ అంటే నవ ఘడ్ అనే ఊరికి చెందిన షంషాద్ అనే కుర్రాడికి మామూలు పిచ్చి కాదు. తన అభిమాన నటుడిని కలవాలని రకరకాలుగా ప్రయత్నించి ఇప్పటికే పలుమార్లు విఫలమయ్యాడు. దాంతో తిరిగి తిరిగి ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయాడో ఏమో కానీ… ఇక తన స్టార్ ని కలుసుకోలేకపోతున్నాననే బాదతో జీవితం చాలించాలని భావించాడు. అనుకున్నదే తడవుగా ఒక భావిపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అది గమనించిన ఊరు జనాలు ఆపాలని ప్రయత్నించడం పోలీసులు సైతం రంగప్రవేశం చేసి.. అజయ్ దేవగన్ తో కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఆ ఆత్మహత్య కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాడు.

అయితే ఈ విషయం అజయ్ దేవ్ గన్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఈ విషయంపై ట్విట్టర్ లో స్పందించిన అజయ్… త్వరలోనే ఆ ఊరి దగ్గర్లోకి షూటింగ్ కి వస్తున్నానని అప్పుడు తప్పకుండా ఆ కుర్రాడిని కలుస్తానని చెప్పాడు. దీంతో ప్రస్తుతానికి ఆ కుర్రాడు కాస్త నెమ్మదించాడట. ఇదంతా గమనించిన కొంతమంది… అభిమానుల్లో ఇతనో రకం అన్న మాట అని కామెంట్స్ చేస్తున్నారు!!