అజిత్ కెమెరాకు చిక్కిన చక్కనైన భామలు!

0సినిమా సెలబ్రిటీస్ లో చాలామంది ఒక మాటను తరచుగా అంటూ ఉంటారు. అదేంటంటే… ‘ఈపని తప్ప మాకు ఇంకోటి చెయ్యడం తెలీదు’. వాళ్ళకు నిజంగా తెలీదో లేదో మనకు తెలిసే అవకాశం తక్కువ గానీ.. నిజంగా అలా ఆల్టర్నేట్ ప్రొఫెషన్ లేని వాళ్ళకు టైం బ్యాడ్ అయ్యి కెరీర్ డౌన్ అయితే చాలా కష్టం. కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళకు ఒకటి కాదు నాలుగు కళల్లో ప్రావీణ్యం ఉంటుంది. ఉదాహరణకు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నే తీసుకోండి. ఆయన మల్టి టాలెంటెడ్.

రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్లలో అజిత్ ఒకడు. అందరూ తల అని ముద్దుగా పిలుచుకునే అజిత్ ఒక ప్రొఫెషనల్ కార్ రేసర్. అంతే కాదు ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్ కూడా. తన ఫోటోలు ఒక టాప్ లీగ్ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలకు ఏమాత్రం తీసిపోవు. ఇప్పటికే తన మరదలు షామిలికి అజిత్ తీసిన ఫోటోలు కొన్ని నెలల క్రితం మీడియా లో రాగా అందరూ అభినందించారు. తాజాగా అజిత్ ఇద్దరూ అందాల భామలకు ఫోటోలు తీయడం విశేషం. ఆ భామలు కాజల్ అగర్వాల్.. శృతి హాసన్.

ఆగష్టు 19 వ తేదీ ని ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం గా జరుపుకుంటారు. ఆ రోజు అజిత్ తీసిన ఈ రెండు ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఇంకేముంది.. అసలే బ్యూటీలు.. పిక్ కర్టసీ (PC )ఏమో తల. ఇక వైరల్ అవకుండా ఉంటాయా? ‘జాక్ ఆఫ్ అల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్’ అనే ఒక ఫేమస్ కొటేషన్ ఉంది. రఫ్ గా చెప్పుకుంటే ‘అన్నిట్లో ఏలెడతారు కానీ ఒక్కటీ సరిగ్గా వచ్చి చావదు’. కానీ ఈ కోలీవుడ్ స్టార్ మాత్రం ఏది పట్టుకున్నా అందులో నైపుణ్యం సాధించేవరకూ వదిలేలా లేడు.. అంటే తల ఈజ్ మాస్టర్ ఆఫ్ ఆల్!