సినీ పరిశ్రమలో విషాదం..అజిత్ కన్నుమూత..

0ప్రముఖ మలయాళ నటుడు కొల్లం అజిత్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా కడుపు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఈయన కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆయనకు భార్య ప్రమీల, కూతురు గాయత్రి, కొడుకు శ్రీహరి ఉన్నారు. ఈ వార్త తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేపు ఈయన అంత్యక్రియలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 1983లో ‘పరన్ను పరన్ను పరన్ను’ సినిమాతో కొల్లం అజిత్ సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ ఆయన నటించి ప్రేక్షకులను అలరించారు.