అజిత్ న్యూ లుక్ సూపర్

0ajith-new-looksకోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కొన్నేళ్లుగా కేవలం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లోనే కనిపిస్తున్నాడు. తన ఏజ్ కి తగ్గ కేరక్టర్స్ మాత్రమే చేస్తానంటూ భీష్మించుకుని కూర్చున్న ఈ హీరో.. గెటప్ విషయంల ఛేంజెస్ చూపిస్తున్నా అన్నీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లోనే ఉంటున్నాయి. కానీ కోలీవుడ్ జనాలు తల 57 అని పిలుచుకుంటున్న తన 57వ సినిమా విషయంలో మాత్రం స్టైలింగ్ పూర్తిగా మార్చేశాడు అజిత్.

తన ఏజ్ 40ప్లస్ కి వచ్చినపటి నుంచి కాసింత ఏజ్డ్ కేరక్టర్స్ చేస్తున్న అజిత్.. శివ దర్శకత్వంలో రూపొందుతన్న కొత్త మూవీలో తన గెటప్ పూర్తిగా మార్చేసి మళ్లీ కుర్రాడిగా మారిపోయాడు. స్కిన్ టైట్ టీషర్టులు… జీన్స్ ప్యాంట్స్.. కండలు తిరిగిన బాడీతో కనిపిస్తుండడంతో.. ఫ్యాన్స్ కి మైండ్ బ్లాంక్ అయిపోతోంది. తల కొత్త సినిమాకి సంబంధించిన ఒక్కో లుక్.. ఒక్కో పోస్టర్.. ఒక్కో అప్ డేట్ ఫ్యాన్స్ లో విపరీతంగా సర్క్యులేట్ అయిపోతోంది.

యూరోప్ తో పాటు హైద్రాబాద్ లోనూ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిటత్.. త్వరలో బల్గేరియా కూడా బయల్దేరనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 27న అజిత్ 57వ సినిమా విడుదల కానుంది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అక్షరహాసన్ మరో హీరోయిన్.. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తుండడం విశేషం.