ఆకాశ్‌ అంబానీ-శ్లోకా నిశ్చితార్ధం

0రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌ అంబానీ-శ్లోకా మెహతా నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. స్నేహితులు, సన్నిహితుల ఆధ్వర్యంలో మార్చి 24న గోవాలో ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో అంబానీ తనకు కాబోయే కోడలికి స్వీట్‌ తినిపిస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

వజ్రాల వ్యాపారి, రోజీ బ్లూ డైమండ్స్‌ అధిపతి రసెల్‌ మెహతా చిన్న కుమార్తె శ్లోక మెహతా. శ్లోక 2009లో ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ నుంచి ఆంత్రోపాలజీలో డిగ్రీ, ది లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌ నుంచి న్యాయ విద్యలో మాస్టర్స్‌ పూర్తి చేసింది. జులై 2014 నుంచి రోజీ బ్లూ స్వచ్ఛంద సంస్థలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుకొనే సమయంలోనే ఆకాశ్‌, శ్లోక ఒకరినొకరు ఇష్టపడేవారని, ఇంటర్ పూర్తి కాగానే ఆకాశ్‌ ఆమెకు తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఇప్పుడు ఇరు కుటుంబాల సమ్మతంతో పెళ్లి చేసుకోబోతున్నారు.