అకీరా గొప్ప కుటుంబంలో పుట్టాడు : రేణు

0ఈ రోజు మెగా కాంఫౌండ్ లో రెండు భర్త డే లు. ఒక అల్లు అర్జున్ ది. రెండు పవన్‌కల్యాణ్‌, రేణూ దేశాయ్‌ల కుమారుడు అకీరా పుట్టినరోజు కూడా నేడే. ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో అభిమానుల నుంచి అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా తల్లి రేణు భావోద్వేగంతో ట్వీట్‌ చేశారు.

‘మీరంతా నా బాబుపై చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. గొప్ప వ్యక్తులు ఉన్న కుటుంబంలో అకీరా జన్మించాడు. తన కుటుంబసభ్యులులాగా అతడు కూడా ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో విజయవంతంగా రాణించాలని, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని తల్లిగా కోరుకుంటున్నా’అని ట్వీట్ చేశారు. అకీరాకు వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కూడా ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు చెప్పడం విశేషం.