కొత్తజంటతో పోజిచ్చిన అఖిల్

0SS రాజమౌళి తనయుడు కార్తికేయ నిశ్చితార్థం తన ఫ్రెండ్ అయిన పూజా ప్రసాద్ తో రీసెంట్ గా జరిగింది. పూజా ప్రసాద్ జగపతి బాబు మేనకోడలు కావడం విశేషం. మీడియా హంగామా కు దూరంగా జరిగిన ఈ ప్రైవేటు ఫంక్షన్ కు సంబంధించిన ఒక ఫోటో ను అఖిల్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపాడు.

అఖిల్ కు కార్తికేయ బెస్ట్ ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. అంతే కాదు పూజా ప్రసాద్ అఖిల్ కు రాఖి కడుతుందట. దీంతో అఖిల్ ఆనందం మామూలుగా లేదు. ఫోటో షేర్ చేస్తూ ఇలా కాప్షన్ పెట్టాడు. “మీ బెస్ట్ ఫ్రెండ్ రాఖి సిస్టర్ లు ఒక ఇంటివారు కాబోతుంటే! ఇద్దరికీ శుభాకాంక్షలు. లవ్ యు అండ్ అల్ ది బెస్ట్. కొత్త జీవితం మీకు అన్నీ ఆనందాలను ఇస్తుందని నమ్ముతున్నా.. నేను మీ పక్కన ఉంటా. ఈ క్షణాన్ని ఎంజాయ్ చెయ్యండి”.

ఈ ఎంగేజ్మెంట్ నుండి బయటకు వచ్చిన ఫస్ట్ పిక్ అఖిల్ షేర్ చేసిందే. చిరునవ్వులు చిందిస్తున్న కొత్త జంటతో కలిసి సూపర్ పోజు ఇచ్చాడు అఖిల్. మరోవైపు ‘బాహుబలి’ ప్రొడ్యూసర్ అయిన శోభు యార్లగడ్డ కూడా ఒక ఫోటో షేర్ చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపాడు.