కూల్ స్టెప్పేస్తున్న అఖిల్

0

అఖిల్ అక్కినేని తాజా చిత్రం ‘Mr. మజ్ను’ రిలీజ్ ఎప్పుడు చేస్తారన్న విషయం పై కాస్త సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. డిసెంబర్ ఫుల్ ప్యాక్డ్ గా ఉండడంతో జనవరి 24 న రిలీజ్ చేయాలని మొదట అనుకున్నారు. కానీ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను అదే డేట్ కి లాక్ చేయడంతో ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ తొలగిపోయింది. ఎందుకంటే ‘Mr. మజ్ను’ తాజాగా దీపావళి శుభాకాంక్షలు చెబుతూ రిలీజ్ చేసిన పోస్టర్లో జనవరి రిలీజ్ అని క్లారిటీ ఇచ్చేశారు.

కానీ డేట్ మాత్రం ప్రకటించలేదు. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను ఫిబ్రవరి 8 కి వాయిదా వేశారని ఇప్పటికే ఫిలిం నగర్లో ఒక టాక్ వినిపిస్తోంది. అధికారికంగా ప్రకటించలేదు గానీ జనవరి 24 న మాత్రం రిలీజ్ కావడం లేదట. దీంతో ఆ డేట్ ను వెంటనే అందిపుచ్చుకోవాలని ‘Mr. మజ్ను’ టీమ్ కర్చీఫ్ వేసేసిందట. ఇక ఈ దీపావళి విషెస్ పోస్టర్లో అఖిల్ యమా స్టైలిష్ గా ఉన్నాడు. ట్రెండీ హెయిర్ స్టైల్.. స్టైలిష్ కాస్ట్యూమ్స్ కి తోడుగా ఒక కూల్ స్టెప్ వేయడంతో దివాలి పోస్టర్ కేక పుట్టిస్తోంది.

ఇలాంటి ఇంట్రెస్టింగ్ పోస్టర్లతో ‘Mr. మజ్ను’ టీమ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
Please Read Disclaimer