అఖిల్ చేతిపై క‌నిపించిన వెరైటీ టాటూ

0


Akhil-tatoo-should-be-intreఈ రోజుల‌లో యూత్ స‌రికొత్త ట్రెండ్ ఫాలో అవుతుంది. ముఖ్యంగా టాటూల‌తో వారు ప్ర‌ద‌ర్శించే స్టైల్సే వేరు. సినీ సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్స్, విద్యార్ధులు ఇలా ప్ర‌తి ఒక్క‌రు త‌మ శ‌రీరాల‌పై వివిధ షేప్స్ లో టాటూలు వేయించుకొని అంద‌రి దృష్టి ఆకర్షిస్తున్నారు.

మొన్నామ‌ధ్య రామ్ చ‌ర‌ణ్ బ్రూస్ లీ సినిమా కోసం త‌న శ‌రీరంపై బ్రూస్ లీ అని టాటూ వేయించుకున్నాడు. ఇక ఇప్పుడు అక్కినేని మూడో త‌రం వార‌సుడు అఖిల్ కూడా త‌న రెండవ సినిమాలో భాగంగా చేతిపై బాణం గుర్తు వేసుకున్నాడు అని ప్ర‌చారం జ‌రుపుతున్నారు.

మేట‌ర్ లోకి వెళితే అఖిల్ త‌నకి కాబోయే వదిన స‌మంత‌తో క‌లిసి క‌రీంన‌గ‌ర్ లో జ‌రిగిన ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యాడు. జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న స‌మ‌యంలో అఖిల్ చేతిపై ఉన్న బాణం గుర్తు, దానిపై ఉన్న 8 నెంబ‌ర్ అంద‌రి క‌ళ్ళ‌ల్లో ప‌డింది.

ఇది సినిమా కోస‌మే వేయించుకున్నాడ‌ని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ త‌న రెండో సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా 8 నెంబ‌ర్ చుట్టే తిరుగుతుందా అనే అనుమానం అభిమానుల‌లో కలుగుతుంది. అందుకు కార‌ణం విక్ర‌మ్ కుమార్ గ‌త సినిమాలు 13,24 అనే నెంబ‌ర్ చుట్టే తిరగడ‌మే. అన్న‌పూర్ణ స్టూడియో బేన‌ర్ లో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి హలో గురు ప్రేమ కోసమే అనే టైటిల్ ని ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం.