అఖిల్ కోసం ఆమె ప్రయత్నం

0


Kalyani-Director-Daughter-Kఅక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతోన్న రెండో సినిమాను.. మనం ఫేమ్ దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై 3 నెలలు గడిచిపోయినా.. ఇంకా హీరోయిన్ ఎవరో ప్రకటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సహజంగా యంగ్ హీరోల సినిమాలు.. ఈ పాటికి మూడొంతుల షూటింగ్ పూర్తి చేసేసుకుంటాయ్ కూడా.

అఖిల్ సెకండ్ మూవీలో హీరోయిన్ రోల్ కు స్క్రీన్ టైం తక్కువ కావడంతో.. పలువురు భామలు అంగీకరించడం లేదని ఇప్పటికే చెప్పేసుకున్నాం. కానీ విక్రమ్ కె కుమార్ పై నమ్మకంతో.. ఈ రోల్ చేసేందుకు ఓ కొత్త భామ ఉత్సాహం చూపుతోందట. ఆమె పేరు కళ్యాణి. ఈమె ఎవరో కాదు.. సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ కూతురే ఈ కళ్యాణి. ఇప్పటికే ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కానీ.. అసిస్టెంట్ డైరెక్టర్ గా మాత్రమే. విక్రమ్ మూవీ ఇంకొక్కడు చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఈమె.. ఇప్పుడు అఖిల్ తో హీరోయిన్ గా నటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే ఈ ప్రపోజల్ అఖిల్ అండ్ నాగ్ దగ్గరకు వచ్చిందట. కళ్యాణిని హీరోయిన్ గా తీసుకోవడంపై ప్రస్తుతం దర్శకుడితో సమాలోచనలు చేస్తున్నారట. ఈ రోల్ కు కనుక ఆమె సూట్ అవుతుందని దర్శకుడు విక్రమ్ కె కుమార్ భావిస్తే.. కళ్యాణి హీరోయిన్ గా మారే అవకాశాలున్నాయి. ప్రస్తుతం డెసిషన్ దర్శకుడి దగ్గర ఆగినట్లు టాక్.