ఈ సారీ అదే తరహాలో రేణు పెళ్లి

0జనసేన అధినేత – సినీ హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పెళ్లి ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. పుణెకు చెందిన ఓ వ్యాపారవేత్తతో రేణు దేశాయ్ ఎంగేజ్ మెంట్ కావడం ఆ ఫొటోను రేణు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. రేణుకు పవన్ విషెస్ చెప్పడం……కొందరు పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ కు తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో రేణు గట్టి వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే. ప్రస్తుతం మీడియాలో – సోషల్ మీడియాలో రేణు పెళ్లి గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేణు పెళ్లి గురించిన విషయం ఆసక్తికరంగా మారింది. తన పిల్లల సమక్షంలోనే రేణు రెండో పెళ్లి చేసుకోబోవడం విశేషం. అకీరా సమక్షంలోనే పవన్ ను రేణు దేశాయ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

వాస్తవానికి పవన్ – రేణులు చాలాకాలం పాటు సహజీవనం చేశారు. అయితే 2009లో పవన్ ప్రజారాజ్యం యువ విభాగం బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో విమర్శలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో …రేణును పవన్ పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే అకీరా వయసు ఐదేళ్లు. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. చివరకు రేణు కూడా పుణెకు చెందినన ఓ వ్యాపార వేత్తతో ఏడడుగులు నడవనుంది. అయితే ఈసారి కూడా అకీరా(14) – ఆధ్య(8) ల సమక్షంలో రేణు వివాహం చేసుకోనుండడం విశేషం. పాశ్యాత్య సంస్కృతిలో పిల్లల సమక్షంలోనే పెళ్లి చేసకోవడం కామన్. అయితే అదే తరహాలో సహజీవనం చేసిన రేణు….ఇపుడు వెస్టర్న్ కంట్రీస్ తరహాలోనే పిల్లల ముందే రెండో పెళ్లి చేసుకోనుండడం విశేషం.