సమంత పై అక్కినేని అమల కామెంట్స్

0Akkineni-Amala-Reacts-on-Samanthaసౌత్ బ్యూటీ సమంత ఇప్పుడు టాప్ హీరోయిన్ స్టేజ్ లో కొనసాగుతూనే.. అక్కినేని వారి ఇంటి కోడలు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏఢాది ప్రారంభంలోనే నాగచైతన్యతో సమంతకు నిశ్చితార్ధం జరగగా.. అక్టోబర్ నెలలో వీరి వివాహ వేడుక జరగనుంది.

సమంత అక్కినేని ఇంటి కోడలు కావడంపై.. ఇప్పటివరకూ అక్కినేని కుటుంబ సభ్యులైన నాగార్జున.. అఖిల్ లు స్పందించారు. కానీ నాగ్ భార్య అయిన అమల నుంచి ప్రతిస్పందన తెలియలేదు. ఇప్పుడు ఆమె కూడా సమంత తమ కోడలు కావడంపై రియాక్ట్ అయ్యారు. తన కాబోయే అత్తగారితో అనుబంధం గురించి సమంత ఇప్పటికే పలుమార్లు చెప్పగా.. ఇప్పుడు అమల కూడా తన అభిప్రాయాన్ని చెప్పేశారు. రీసెంట్ గా అన్నపూర్ణ ఫిలిం స్కూల్ లో జరగిన ఈవెంట్ లో.. మీడియాతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు అమల.

‘సమంత లాంటి అందమైన.. మంచి అమ్మాయి మా ఇంటి కోడలు కావడంపై.. అక్కినేని కుటుంబం అంతా ఎంతో ఆనందంగా ఉందిని.. ఆమె మా ఇంటి కోడలు కావడం అదృష్టంగా భావిస్తున్నాం. చైతు.. సమంత పెళ్లి గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం’ అని అమలు చెప్పడం విశేషం. సమంత తమ ఇంటికి రావడం తమ అదృష్టం అని అమల అనేశారంటే.. ఎంతటి ఆప్యాయత కురిపించేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.