అక్కినేనీస్ ‘మనం-2’ తీస్తారా?

0

లెజెండ్ ఏఎన్నార్ తో కలిసి సకుటుంబ సమేతంగా మల్టీస్టారర్ లో నటించి సంచలన విజయం అందుకున్నారు అక్కినేనీస్. ఏఎన్నార్ – నాగార్జున – నాగచైతన్య – అఖిల్ – సమంత .. ఇలా ఫ్యామిలీ స్టార్లంతా కలిసి నటించిన `మనం` 2014లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. విక్రమ్.కె.కుమార్ ఆ సినిమాకి సీక్వెల్ కథ రాస్తున్నాడన్న ప్రచారం ఉంది. మరోసారి మూడు తరాల అక్కినేనీస్ `మనం-2`తో మ్యాజిక్ చేస్తారన్న ప్రచారం ఇదివరకూ సాగింది. అయితే అందుకు ఇంకెంతో సమయం పట్టకపోవచ్చు. ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ రన్ అవుతోంది కాబట్టి మనం-2 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ను కాదని అనలేం.

ఒకవేళ మనం-2 తీస్తే ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న స్టార్లంతా ఆ చిత్రంలో నటించే అవకాశం ఉంది. అయితే ఈసారి ఒకే ఒక్క లోటు. `మనం`లో తనదైన అభినయంతో కట్టిపడేసిన లెజెండ్ ఏఎన్నార్ సీక్వెల్ లో మిస్సవ్వడం అభిమానులకు బాధాకరమే. అయినా అక్కినేని హీరోలంతా కలిసి ఈ సినిమా సీక్వెల్ ని వెంటనే ప్రారంభిస్తే చూడాలన్న ఆకాంక్ష అక్కినేని అభిమానుల్లో బలంగా ఉంది. అందుకు సింబాలిక్ గానో – లేక యాథృచ్ఛికంగానో ఆ కుటుంబం ఇటీవలే విహారయాత్రల్లో సెలబ్రేట్ చేసుకుంటున్న ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అక్కినేని కుటుంబం ప్రస్తుతం ఐబిజాలో జాలీట్రిప్ ను ఎంజాయ్ చేస్తుంటే ఫ్యాన్స్ `మనం 2` సెట్స్ నుంచా? అన్న కన్ఫ్యూజన్ కి లోనయ్యారు.

నాగార్జున – అమల – నాగచైతన్య – సమంత – అఖిల్ తదితరులు ఈ విహార యాత్రలో ఉన్నారు. సమంత స్వయంగా ఫొటోలను షేర్ చేశారు. దేవదాస్ విడుదలకు ముందు రోజే కింగ్ ఈ ట్రిప్ లో జాయిన్ అయ్యారట. దేవదాస్ సక్సెస్ సంతోషంతో.. విహారయాత్ర ఇంకా సరదాగా ఉంది అంటూ కింగ్ తాజాగా ట్వీట్ చేశారు. దేవదాస్ తర్వాత కింగ్ నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో `బంగార్రాజు` చిత్రంలో నటించే అవకాశం ఉంది. ఆ క్రమంలోనే విక్రమ్.కె.కుమార్ అందుబాటులోనే ఉన్నారు కాబట్టి `మనం-2` ప్రిపరేషన్స్ సాగుతాయేమో చూడాలి. ఇకపోతే నాగార్జున ధనుష్ తో ఓ మల్టీస్టారర్ – మలయాళంలో వేరొక మల్టీస్టారర్ లో నటించనున్నారు. బాలీవుడ్ లో `బ్రహ్మాస్త్ర` లాంటి క్రేజీ మల్టీస్టారర్ లోనూ ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer