అక్కినేని ఫ్యామిలి మల్టీ స్టారర్?

0nagarjuna-naga-chaitanya-akఫ్యామిలీ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన మనం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు అక్కినేని ఫ్యామిలి. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలు కలిసి నటించారు. అఖిల్ కూడా అతిథి పాత్రలో కనిపించటంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఇదే ఫ్యామిలీ నుంచి ఓ మల్టీ స్టారర్ సినిమా రెడీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.

దిల్ రాజు నిర్మాతగా శతమానం భవతి ఫేం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. నాగార్జున, నాగచైతన్యలు హీరోలుగా నటించనున్న ఈ సినిమాకు ప్రస్తుతం కథ రెడీ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.