ట్రైలర్ టాక్: స్కిన్ షోతో రెచ్చిపోయిందే

0Aksar-2-Official-Trailerబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా చాన్స్ దొరికిందంటే చాలు ఇక ఆమె స్టార్ హీరోయిన్ కావాల్సిందే. ఒకవేళ సల్మాన్ తో నటించిన సినిమా నిరాశపరిస్తే తర్వాత ఎదో విధంగా ఛాన్సులు వస్తాయి. బాలీవుడ్ లో సల్లు భాయ్ ఎంత చెబితే అంత అని టాక్ ఉంది. అయితే అదే తరహాలో సల్మాన్ వీర్ సినిమాలో నటించి అపజయాన్ని మూటగట్టుకున్న జరీన్ ఖాన్ ఆ తర్వాత సల్లు భాయ్ రెడీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఆ తర్వాత రెండు మూడు సునిమాలు చేసినా సరైన స్టార్ డమ్ దక్కలేదు.

దీంతో ఆ తర్వాత వచ్చిన ఛాన్స్ కి అమ్మడు తన అందలన్నింటిని ఒక్కసారిగా హాట్ గా చూపించి మంచి విజయాన్ని అందుకుంది. ఏరోటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిన “హేట్ స్టోరీ 3” సినిమాలో ఇద్దరి హీరోలతో రొమాన్స్ చేసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. గ్లామర్ గర్ల్ గా మంచి పేరు తెచ్చుకోవడంతో క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో కూడా అందాల తోనే చూసినవారిని చంపేస్తోంది. ఇక హిందీ వీరప్పన్ సినిమాలో కూడా ఈ అమ్మడు ఓ స్పెషల్ సాంగ్ కి చిందులేసింది. మళ్లీ చాలా రోజుల తర్వాత మరో ట్రయాంగిల్ లవ్ స్టొరీ తో రాబోతోంది. అక్సర్ 2 సినిమాలో ఈ సారి కూడా మరో ఇద్దరు కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తూ.. బాక్స్ ఆఫీస్ హిట్ పై కన్నేసింది.

రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ అమ్మడు సినిమాలో ఎలా ఉండబోతోందో చూపించేసింది. స్కిన్ షోలో ఏ మాత్రం తగ్గకుండా చాలా సెక్సీగా చూపించింది. బికినీల్లో లోదుస్తుల్లో రెచ్చిపోయింది అంతే. మొత్తానికి మామూలు హీరోయిన్ గా కంటే ఇలాంటి హార్డ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ తో నటిస్తూ.. తనదైన శైలిలో సినిమాలని చేస్తోంది. అనంత్ నారాయణన్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 6 ప్రేక్షకుల ముందుకు రానుంది.