అక్షర్‌ పటేల్‌ ఓ లగ్జరీ కారు కొనుగోలు

0discovery-new-carమన క్రికెటర్లకు బైక్‌లు, కారులు అంటే ఎంత మోజో అందిరికీ తెలిసిందే. కాస్త విరామం దొరికితే చాలు రయ్‌రయ్‌మంటూ చక్కర్లు కొడుతుంటారు. మహేంద్ర సింగ్‌ ధోనీ తన ఇంటి వద్ద బైక్‌ల కోసం ప్రత్యేక గ్యారేజీ ఏర్పాటు చేసుకున్నాడు. అతనికి బైక్‌ రైడింగ్‌ అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. అలాగే కోహ్లీ వద్ద ఇప్పటికే లగ్జరీ కార్లు ఎన్నో ఉన్నాయి. ఆడీ ఎస్‌6, ఆడీ ఏ8-ఎల్‌, ఆడీ క్యూ7, ఆడీ ఆర్‌8, ఆడీ ఆర్‌8 ఎల్‌ఎమ్‌ఎక్స్‌, ఆస్టన్‌ మార్టిన్‌ డీబీఎస్‌ లాంటి లగ్జరీ కార్లు కోహ్లీ ఇంట్లో కొలువు దీరి ఉన్నాయి. తాజాగా మరో క్రికెటర్‌ అక్షర్‌ పటేల్‌ ఓ లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని అతడే సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ఇంతకీ అక్షర్‌ కొనుగోలు చేసిన కారు ఏమిటా అనే కదా మీరు ఆలోచిస్తున్నది. ల్యాండ్‌ రోవర్‌ డిస్కవరీ ప్రిమియర్‌ ఎస్‌యూవీ. దీని ఖరీదు సుమారు రూ.40లక్షలకుపైనే. గుజరాత్‌కు చెందిన ఈ క్రికెటర్‌ ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌లో ఆడిన సంగతి తెలిసిందే. దిల్లీలో జరిగిన తొలి టీ20లో అక్షర్‌ రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం రాజ్‌కోట్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. రెండు వన్డేలు ఆడిన అక్షర్‌కు ఒక్క వికెట్‌ మాత్రమే దక్కింది.

ఈ ఏడాది ఆగస్టులో లంక పర్యటనలో ఉన్న హార్దిక్‌ పాండ్య స్వదేశంలో ఉన్న నాన్నకు కారు కొనిచ్చి సర్‌ప్రైజ్‌ చేసిన సంగతి తెలిసిందే.