మన్మథుడి కోసం శాండల్ వుడ్ బ్యూటీ

0

త్రివిక్రమ్-విజయ్ భాస్కర్ లకు ఏ ముహూర్తంలో మన్మథుడు అనే టైటిల్ తట్టిందో కానీ అప్పటి నుంచి కింగ్ నాగార్జున సార్థక నామధేయుడిగా మారి వయసుతో సంబంధం లేకుండా తన గ్లామర్ ను పెంచుకుంటూ పోతూనే ఉన్నాడు. ఇటీవలే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ప్రారంభమైన మన్మథుడు 2 తాలూకు స్టిల్స్ చూసి అభిమానులకే కాదు ప్రేక్షకులకు సైతం మతులు పోతున్నాయి.

మనవళ్లు వచ్చే వయసులో కూడా కొడుకులతో పోటీ పడుతూ చార్మ్ మైంటైన్ చేస్తున్న నాగ్ రహస్యం ఏమిటంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి .ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తనతో పాటు మరో అమ్మాయి కూడా నాగ్ ప్రేమలో పడే కీలక పాత్ర చేస్తోందట. తనే అక్షర.

కర్ణాటక సిని రంగానికి చెందిన అక్షరను సుమారు 30 మోడల్స్ ని వడబోత పోసిన తర్వాత ఎంపిక చేసినట్టు తెలిసింది. మన్మథుడు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అన్షు తరహాలో ఉంటుందా లేక ఆడవారి మాటలకు అర్థాలే వేరులే స్వాతి తరహాలో ఉంటుందా అనే దాని గురించి ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి వర్కింగ్ స్టిల్స్ తోనే హైప్ తెచ్చేసుకుంటున్న మన్మథుడు 2 ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఈ అక్షర వచ్చే నెల నుంచి జాయిన్ కానుంది
Please Read Disclaimer