అక్షర హాసన్ బాడీ మాత్రమే గర్ల్ అట!

0Akshara-Haasanఒక్క తమిళంలోనే కాకుండా యావత్తు భారతావనిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కమల్ హాసన్‌కు వారసులొచ్చేశారు. ఇప్పటికే ఆయన పెద్ద కూతురు హోదాలో శృతి హాసన్ టాలీవుడ్ లో దుమ్ము రేపేస్తోంది. తన మొదటి భార్య సారిక ద్వారా కమల్‌కు ఇద్దరు కూతుర్లున్న సంగతి తెలిసిందే. వారిలో శృతి పెద్దది కాగా… చిన్న కూతురు అక్షర హాసన్ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోది. షమితాబ్ చిత్రం ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు… ఇప్పుడు తన రెండో చిత్రం లాలీ కి షాదీ మే లడ్డూ దీవానా చిత్రం కోసం తనను తాను మార్చేసుకుంటోంది.

ఈ క్రమంలో ఓ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అక్షర చాలా విషయాలే చెప్పేసింది. ఈ విషయాల్లో తన ఎఫైర్స్ దగ్గర నుంచి తన సోదరి శృతి – తల్లిదండ్రులు విడిపోయిన వైనం పెళ్లిపై తన అభిప్రాయాలు తన బాడీ లాంగ్వేజ్ తన యాటిట్యూట్ అన్నింటినీ కూడా అక్షర ఏమాత్రం మొహమాటం లేకుండానే చెప్పేసింది. ఆ విషయాల్లోకి వెళితే… బాలీవుడ్ హీరో తనుజ్ వీర్వానీతో ఉన్న ఎఫైర్ పై ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ లేదని అక్షర తేల్చేసింది. తాము బెస్ట్ ఫ్రెండ్స్‌మి మాత్రమేనని ఈ అమ్మడు చెప్పింది. అసలు ఈ తరహా వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయోనని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తనకు చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని అంతమాత్రాన ఎఫైర్ అంటే ఎలాగంటూ ఎదురు ప్రశ్నించింది.

ఇక తన రెండో చిత్రంలో అక్షర తన మాజీ బాయ్ ఫ్రెండ్ వివాన్ షాతో కలిసి చేస్తోంది. అతడితో రిలేషన్ షిప్ ను ప్రస్తావిస్తే… అదంతా గతమని తాము ఇప్పుడు ఫ్రెండ్స్‌గా ఉన్నామని చెప్పింది. చిన్నప్పటి నుంచి తాము ఫ్రెండ్స్ గా ఉన్నామని ‘హే రామ్’ చిత్రం షూటింగ్ సెట్స్‌లో తాము బాగా అల్లరి చేసేవారిమని గతాన్ని గుర్తు చేసుకున్న అక్షర… కలిసి నటించే విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. ప్రస్తుతం ఫ్రెండ్స్‌గా ఉండేందుకు మాత్రమే తాము నిర్ణయించుకున్నామని కూడా ఆమె చెప్పింది.

ఇక తన తల్లిదండ్రుల బ్రేకప్ పై మాట్లాడిన అక్షర… ఇద్దరి మనసులు కలవకపోతే… విడిపోవడమే బెటరన్న రీతిలో రూలింగ్ ఇచ్చేసింది. మనసులు కలవనప్పుడు… కలిసి ఉండే కంటే కంటే కూడా విడివిడిగా బతికితేనే బాగుంటుందని చెప్పింది. అయితే తన తల్లిదండ్రుల బ్రేకప్ అంశం… పెళ్లిపై తనకున్న అభిప్రాయాన్ని మాత్రం ప్రభావితం చేయలేదని చెప్పింది. ఒక తన స్కూల్ డేస్‌ను గుర్తు చేసుకున్న అక్షర చాలా ఆసక్తికర విషయాలను చెప్పింది. తనకు అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవారని చెప్పిన అక్షర… ఇప్పటికీ తన ఫ్రెండ్ సర్కిల్ లో అబ్బాయిల సంఖ్యే ఎక్కువని తెలిపింది.

తన బాడీ మాత్రమే అమ్మాయిదని బ్రెయిన్ మాత్రం అబ్బాయిలదని చెప్పింది. తన ఫ్రెండ్స్ చాలా మంది కూడా తనను అబ్బాయిలాగనే ట్రీట్ చేసేవారని తెలిపింది. ఈ కారణంగానే తనను అంతా ‘ హే బ్రో’ అనో లేదంటే… * యే బాయ్* అనో పిలిచేవారని చెప్పిన ఈ అమ్మడు… తనను అంతా టామ్ బాయ్‌లా చూసేవారని చెప్పింది. ఇక తన రెండో చిత్రం కోసం అక్షర… తన జుత్తును బాగా పెంచేస్తోందట. ఇలా హెయిర్ సైజ్ పెంచేయడం తన లైఫ్‌లో ఇది రెండోసారి అని ఆమె తెలిపింది.

తన అక్క శృతి హాసన్ గురించి మాట్లాడుతూ… ఇప్పటికే శృతి తానేంటో నిరూపించుకుందని కితాబిచ్చింది. ఆ స్థాయిని అందుకునేందుకు తాను ప్రయత్నిస్తున్నానని చెప్పింది. ఇక మేకప్ విషయంలో శృతి తనను బలవంతపెట్టేస్తుంటుందని కూడా అక్షర గారాలు పోయింది. అయితే నేచురల్‌గా ఉండేందుకే తాను ఇష్టపడతానని మేకప్ క్రీములు తన మేనిని ఇబ్బంది పెడతాయని కూడా ఆమె చెప్పుకొచ్చింది.