గీత గోవిందులకు గోల్డ్ స్ట్రోక్

0అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సోలో హీరోగా చేస్తున్న గీత గోవిందం మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇంకేం కావాలే పాట ఇప్పటికే కావాల్సినంత హైప్ తీసుకురాగా వెరైటీగా కట్ చేసిన టీజర్ అంచనాలు పెంచేసింది. గీతా ఆర్ట్స్ సమర్పణలో వస్తున్న సినిమా కాబట్టి మేకింగ్ పరంగా కూడా అనుమానాలు ఉండవు. ఛలో ఫేమ్ రష్మిక మండన్న హీరోయిన్ గా చేయటం బాగా ప్లస్ అవుతోంది. నిజానికి చాలా ప్లాన్డ్ గా పోటీ లేకుండా దీని రిలీజ్ ని ప్లాన్ చేసారు. ఇప్పటికిప్పుడు హఠాత్తుగా పుట్టుకురాలేదు కానీ ఎ సెంటర్స్ లో మాత్రం అక్షయ్ కుమార్ నుంచి గీత గోవిందులకు కాస్త ఇబ్బంది తప్పేలా లేదు. కారణం అదే రోజు గోల్డ్ విడుదల అవుతోంది. స్వాతంత్రం వచ్చాక ఇండియా గెలిచిన మొదటి ఒలంపిక్ మెడల్ నేపధ్యాన్ని తీసుకుని అల్లిన కథగా దీని మీద హైప్ ఓ రేంజ్ లో ఉంది. దానికి తోడు విభిన్నమైన సినిమాలతో అంతకంతా తన మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్న అక్షయ్ కుమార్ హీరో కావడం అసలు ప్లస్ పాయింట్.

అంటే గీత గోవిందంకు గోల్డ్ నుంచి పూర్తి ముప్పు ఉందని చెప్పలేం. కానీ హైదరాబాద్ లాంటి నగరాల్లో మల్టీ ప్లెక్స్ స్క్రీన్లను పంచుకునే విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. స్టార్ హీరో మూవీ కాబట్టి గోల్డ్ కు చెప్పుకోదగ్గ స్థాయిలోనే స్క్రీన్లు ఇస్తారు. పైగా దేశ భక్తి నేపధ్యం కనక ఓపెనింగ్స్ కూడా బాగుంటాయి. టాక్ బాగుంటే చిక్కులు పెరుగుతాయి. తేడా వస్తే గీత గోవిందులకు ఉన్న చిన్న అడ్డంకి తగ్గిపోతుంది. కానీ బిసి సెంటర్స్ లో ఇదేమంత సమస్య కాదు. థియేటర్లు తక్కువగా ఉన్న చోట గోల్డ్ విడుదల చేస్తారన్న గ్యారెంటీ లేదు. అది గీత గోవిందంకు హెల్ప్ అవుతుంది. పైగా గీత సంస్థ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి థియేటర్లకు ఇబ్బంది ఉండదు. కానీ ఎటొచ్చి మల్టీ ప్లెక్సులతోనే గోల్డ్ తో చిక్కు రావొచ్చు. ఇప్పటికే గోల్డ్ ట్రైలర్ కు భీభత్సమైన రెస్పాన్స్ ఉంది. ఇది చాలదు అన్నట్టు ఐమ్యాక్స్ వెర్షన్ కూడా విడుదల చేస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే గీత గోవిందంలకు ముఖ్య నగరాల్లో ఇబ్బంది తప్పేలా లేదు.