అక్ష‌య్ కుమార్ ‘టాయిలెట్’ లీక్

0toilet-ek-prem-katha-movie-బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ రీసెంట్ మూవీ “టాయిలెట్.. ఏక్ ప్రేమ్ క‌థా” మూవీ సినిమా రిలీజ్ అవ‌క‌ముందే ఆన్ లైన్ లో లీక‌యింది. లీక‌యిన వీడియో గురించి ముందుగా కోరియోగ్రాఫ‌ర్ రెమో డిసౌజా కు తెలియ‌డంతో వెంట‌నే సినిమా ప్రొడ్యూస‌ర్ కు విష‌యాన్ని తెలియ‌జేశాడు. రెమో కు ఓ వ్య‌క్తి క‌లిసి… త‌న వ‌ద్ద టాయిలెట్ మూవీ మొత్తం పెన్ డ్రైవ్ లో ఉంద‌ని చెప్పాడ‌ట‌. అయితే.. రెమో అత‌డిని ముందుగా న‌మ్మ‌లేద‌ట‌. కాని.. ఆ వ్య‌క్తి పెన్ డ్రైవ్ తీసుకొచ్చి రెమో కు ఇవ్వ‌గా.. పెన్ డ్రైవ్ ను చెక్ చేస్తే అందులో నిజంగానే టాయిలెట్ మూవీ మొత్తం ఉంద‌ట‌.

వెంట‌నే అక్ష‌య్ కు ఈ విష‌యాన్ని తెల‌ప‌డానికి ట్రై చేయ‌గా.. అక్ష‌య్ లండ‌న్ లో ఉండ‌టంతో కుద‌ర‌లేద‌ట‌. వెంట‌నే మూవీ ప్రొడ్యూస‌ర్ ప్రేమా అరోరా, డైరెక్ట‌ర్ శ్రీ నారాయ‌న్ సింగ్ కు ఫోన్ చేసి చెప్పాడ‌ట‌. డైరెక్ట‌ర్ రెమో ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆ పెన్ డ్రైవ్ ను కలెక్ట్ చేసుకున్నాడ‌ట‌. త‌ర్వాత విష‌యం అక్ష‌య్ కు కూడా తెలియ‌డంతో పైర‌సీ ని అరిక‌ట్టాలంటూ అభిమానుల‌కు సందేశం పంపించాడు అక్ష‌య్. అంద‌రం క‌లిసి పైర‌సీ భూతం మీద ఫైట్ చేయాల‌ని పిలుపునిచ్చాడు అక్ష‌య్. ఇంకా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుపుకుంటున్న మూవీ బ‌య‌టికి ఎలా వ‌చ్చింద‌నే విష‌యంపై ఆరా తీస్తున్న‌ది మూవీ యూనిట్.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్వ‌చ్ఛ్ భార‌త్ ఉద్య‌మం నేప‌థ్యంలో వ‌చ్చిన టాయిలెట్ మూవీ లో హీరోయిన్ గా భూమి పెద్నేక‌ర్ న‌టిస్తుండ‌గా… అనుప‌మ్ కేర్, స‌నా ఖాన్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించారు. అగ‌స్టు 11 న మూవీ రిలీజ‌వ‌నుంది. అక్ష‌య్ కుమార్, నీర‌జ్ పాండే ఈ మూవీకి కో ప్రొడ్యూస‌ర్స్.