నా భర్త జోలికి వస్తే నరికేస్తా..!

0Akun-Sabharwal-Wife-smita-sసిట్ అధికారి అకున్ సబర్వాల్‌కు వస్తున్న బెదిరింపులు తాజాగా సంచలనం సృష్టిస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాను కూకటివేళ్లతో సహా తొలగించే పనిలో ఆరడుగుల బుల్లెట్‌లా అకున్ దూసుకుపోతున్నారు. సమగ్రమైన సాక్ష్యాధారాలతో అనుమానితులను ఆరా తీస్తూ ఖంగుతినిపిస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసులో రోజుకొక కొత్తపేరు వెలుగులోకి వచ్చి జనాన్నిఖంగుతినిపిస్తోంది. ఇంత సీరియస్‌గా దేశంలోని ఏ రాష్ట్రంలో.. ఏ ఐపీఎస్.. ఈ తరహా మాఫియాపై విచారణ చేయలేదు. రోజురోజుకీ ఈ కేసు మూలాలు కదులుతుండడంతో అకున్ సబర్వాల్‌కు బెదిరింపులు పెరిగాయి. ఈ విషయం ఆయన డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయనకు అదనపు భద్రతా ఏర్పాట్లు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా తన భర్తపై వస్తున్న బెదిరింపులపై అకున్ భార్య ఐఏఎస్ అధికారిని స్మిత సబర్వాల్ తీవ్రంగా స్పందించారని వినికిడి. తన భర్తకు ఏమైనా జరిగితే అలా చేసేవారిని ఎవరినీ వదలకుండా చంపేస్తానని ఆమె సహచరులతో కోపంగా స్పందించినట్లు తెలియవచ్చింది. ఓ మంచి పనికి స్పందించి సహకరించాల్సింది పోయి.. ఇలా హీనంగా బెదిరించడం ఏమిటని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తం మీద మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు ఈ ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు గొప్ప ఉదాహరణగా నిలిచారు. జనం మనసు గెలుచుకున్నారు.