ఆలీ పేల్చిన ఆ అడల్ట్ జోక్ ఏంటి?

0కమెడియన్ ఆలీ వేదికెక్కాడంటే.. అతడి నోటి నుంచి ఎప్పుడు ఎలాంటి కామెంట్ వస్తుందో అంచనా వేయలేం. ఏ విషయాన్నీ మామూలుగా చెప్పడానికి ఆలీ ఇష్టపడడు. ప్రతి మాటకూ కొంచెం మసాలా అద్దుతుంటాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు అతడి మాటలు శ్రుతి మించిపోతుంటాయి. కొన్ని సార్లు ఆలీ వ్యాఖ్యలు హద్దులు దాటి వివాదాలు కూడా చెలరేగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఐతే ‘కాటమరాయుడు’ ఆడియో వేడుకలో కొంచెం ఆచితూచి మాట్లాడాడు ఆలీ. ఐతే మైకు పట్టుకుని ఏ అడల్ట్ జోకూ పేల్చకపోయినా.. నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతున్నపుడు మాత్రం చాటుగా ఆలీ ఏదో పెద్ద బూతు జోకే వేసినట్లున్నాడు. అతనేమన్నాడో కానీ.. పవన్ నవ్వాపుకోలేక ఎగిరి గంతులేస్తూ చాలా విచిత్రంగా స్పందించాడు.

పవన్ గత నెలలో అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అందరూ పవన్ స్పీచ్ గురించే మాట్లాడుకున్నారని.. కానీ ఆయన సూట్లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించారని అన్నాడు శరత్. తర్వాత ‘కాటమరాయుడు’లో పంచెకట్టులో పవన్ డబుల్ హ్యాండ్సమ్ గా ఉన్నారని అన్నాడు. అంతలో ఆలీ అందుకుని.. పక్కనే ఉన్న పవన్ తో ఏదో అన్నాడు. అంతే పవన్ పగలబడి నవ్వేస్తూ చిత్రమైన రియాక్షన్ ఇచ్చాడు. బహుశా ఇక్కడ ఆలీ ఏదో ‘చిలిపి’ జోక్ పేల్చి ఉంటాడేమో. అందుకే పవన్ అలా రియాక్టయి ఉన్నట్లున్నాడు. శరత్ మరార్ మాటల ఫ్లోను బట్టి.. ఆలీ అంటే ఏంటో అవగాహన ఉన్నవాళ్లు ఈ జోక్ ఏంటో అంచనా వేయడం కష్టమేమీ కాకపోవచ్చు.